బెయిలుకు ఎక్కువ… జైలుకు తక్కువ: కాసంశెట్టి సుధీర్

ఉరవకొండ, వై.యెస్.జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో పాత్రికేయులు జగన్ రెడ్డితో పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్సిపి పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం కుదరదు అన్న విషయంపై మీ స్పందన ఏమిటి అని అడగగా జగన్మోహన్ రెడ్డి వ్యంగ్యంగా చెప్పిన సమాధానం పవన్ కళ్యాణ్ కార్పొరేటర్ కుఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని చేసిన విమర్శ జనసేన పార్టీ నాయకులలో బాధను కలగజేసిందని కాసంశెట్టి సుధీర్ పేర్కొన్నారు. కాసంశెట్టి సుధీర్ మాట్లాడుతూ 2019లో జగన్ గెలిచిన తర్వాత అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీకి 23 సీట్లు ఉండగా టిడిపి నుండి ఒక ఐదో ఆరో సీట్లు వైసిపి లాక్కుంటే తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని అసెంబ్లీ సాక్షిగా జగన్ చేసిన వ్యాఖ్యలు నిజమైనప్పుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జగన్ ఇటువంటి నీతిపరుడు ప్రజలు తెలుసుకొని 2024 ఎన్నికలలో జగన్ కు కేవలం 11 సీట్లకు పరిమితం చేశారు. ఆరోజున 18 సీట్లు లేకుంటే ప్రతిపక్ష హోదా రాదు అన్న మీరు ఈరోజు 11 సీట్లకే ప్రతిపక్ష హోదా అడగడం సిగ్గుచేటు అని ప్రశ్నించారు. జగన్ రెడ్డి బెయిల్ కు ఎక్కువ జైలుకు తక్కువ అని సంబోధించారు. పవన్ కళ్యాణ్ స్థాయి మర్చిపోయి దిగజారుడు మాటలు మాట్లాడొద్దు జగన్ అంటూ పవన్ కళ్యాణ్ స్థాయి దేశం గర్వించదగ్గ స్థాయి అని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 ఎన్నికలలో పవన్ కళ్యాణ్ 21 సీట్లలో పోటీ చేసి 21 సీట్లలో అత్యధికంగా మెజారిటీ సాధించి భారత దేశంలోనే మొట్టమొదటి 100% స్ట్రైక్ రేట్ ఉన్న పార్టీ ఒక్క జనసేన పార్టీ అని జగన్ తెలుసుకోవాలి అని పవన్ కళ్యాణ్ స్థాయిని హోదాని గుర్తించి మీరు మీ పార్టీ నాయకులు సరైన విధంగా గౌరవం ఇవ్వాలని తెలియజేశారు. మీ వైఎస్ఆర్సిపి వ్యవహార శైలి మార్చుకోకపోతే 2029లో ఇంతకంటే తక్కువ ఘోర పరాజయాన్ని చవి చూడాల్సిన పరిస్థితి మీ పార్టీకి రాక తప్పదని మీడియ ముఖంగా తెలియజేశారు.

Share this content:

Post Comment