ఓటీటీలో `మోసగాళ్ళు` ఇక్కడైనా విష్ణు సక్సెస్ అయ్యేనా?

మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం మోసగాళ్ళు. హాలీవుడ్ దర్శకుడు జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహించారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై విష్ణు మంచు నిర్మాతగా వ్యవహరించారు.

ప్రపంచలోనే బిగ్గెస్ట్ ఐటీ స్కామ్‌ నేపథ్యంలో యాదార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీ రూపొందింది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కీలక పాత్రలో నటించారు. ఇక భారీ అంచనాల నడుమ మార్చిలో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం విడుదల కాగా.. బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.

అయితే ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ బాట పట్టింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ ఈ చిత్రాన్ని నేడు స్ట్రీమింగ్ చేసింది. మరి డిజిటల్ ఫ్లాట్ ఫామ్‌పైనైనా విష్ణు సక్సెస్ అవుతాడో.. లేదో.. చూడాలి.