దీపావళి కానుకగా ‘మోసగాళ్లు’ పోస్టర్, టీజర్

24 ఫిలిం ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌లపై మంచు విష్ణు హీరోగా స్వయంగా నిర్మిస్తున్న సినిమా మోసగాళ్లు. ఈ సినిమాకు హాలీవుడ్‌ దర్శకుడు జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ యాక్టర్ సునీల్ శెట్టి టాలీవుడ్ కు పరిచయం అవుతున్న ఈ చిత్రంలో రుహీ సింగ్ – నవదీప్ – నవీన్ చంద్ర ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఏసీపీ కుమార్‌గా ఐటీ కుంభకోణానికి సంబంధించిన నిందితులను పట్టుకునే పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో సునీల్ శెట్టి కనిపించనున్నారు. ఇక ఈ సినిమా నుంచి దీపావళి కానుకగా ముందుగా ఓ పోస్టర్ ను విడుదల చేసి.. ఏసీపీ కుమార్ గా సునీల్ శెట్టి ఫస్ట్ లుక్ ను రివీల్ చేశారు. తాజాగా సునీల్ శెట్టి పాత్రకు సంబంధించి టీజర్ విడుదలైంది. ఇందులో మంచు విష్ణు నుదుటున గన్ పెట్టి సునీల్ శెట్టి మాట్లాడుతున్నాడు.  తెలుగుతో పాటు తమిళం.. హిందీ… మలయాళం.. కన్నడంలో ఈ సినిమా విడుదల కాబోతుంది. ప్రపంచంలోనే అత్యంత భారీ ఐటీ కుంభకోణం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తుంది.