మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వచ్చేస్తున్నాడు

అఖిల్ – పూజా హగ్దే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. అఖిల్ నాల్గొవ చిత్రం గా రాబోతున్న ఈ మూవీ ఫై భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఇంతవరకు అఖిల్ చేసిన మూడు సినిమాలు ప్రేక్షకులను , అభిమానులను పెద్దగా ఆకట్టుకోలేకపోవడం తో ఈ సినిమా విషయంలో గట్టి నమ్మకాలే పెట్టుకున్నాడు. కాగా ప్రస్తుతం చిత్రసీమలో సెట్స్ ఫై ఉన్న సినిమాలన్నీ తమ రిలీజ్ డేట్స్ ప్రకటిస్తుండగా..బ్యాచిలర్ రిలీజ్ డేట్ కోసం అక్కినేని అభిమానులు ఎదురుచూస్తున్న తరుణంలో రిలీజ్ డేట్ ప్రకటించి ఆనందం నింపారు.

జూన్ `19న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు పోస్టర్ ను విడుదల చేసి ఆకట్టుకున్నారు. నిజానికి సంక్రాంతికే సినిమా విడుదల చేస్తామని చిత్రయూనిట్‌ ప్రకటించింది. కానీ వరుసగా సినిమాలు పోటీ పడటంతో సోలోగా రావడమే బెటర్ అని సినిమాను జూన్ కు వాయిదా వేశారు.