బోనకల్ శాంతి నిలయంలో మదర్ థెరిస్సా జయంతి వేడుకలు

మదిర, బోనకల్, మానవ మాతృమూర్తి మదర్ థెరిస్సా జయంతి సందర్బంగా బోనకల్ శాంతి నిలయంలో జనసేన మండల కమిటీ ఆధ్వర్యంలో పండ్లు పంపిణి చేయడం జరిగింది. ఈ సందర్బంగా బోనకల్ మండల అధ్యక్షుడు తాళ్లూరి డేవిడ్ మాట్లాడుతూ… ప్రేమ, శాంతిని ఏర్పరుస్తూ ఈ ప్రపంచంలో ఐకమత్యానికి దారి చూపగలిగేది కేవలం పవిత్రమైన ప్రేమ అంటూ ఎంతో మంది అనాధలకు ప్రేమ పంచిన మథర్ థెరిస్సా జయంతి సందర్బంగా ఆ గొప్ప ప్రేమ మూర్తికి బోనకల్ మండల జనసేన పార్టీ తరపున ఘన నివాళిలు అర్పిస్తున్నామని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి విభాగం నాయకులు గంధం ఆనంద్, షేక్ జానీపాషా, సజ్జనపు భరత్ తదితరులు పాల్గొన్నారు.