ఎంపీ గోరంట్ల వెంటనే రాజీనామా చేయాలి: ఆకుల ఉమేష్

హిందూపురం పార్లమెంట్ సభ్యుడు గోరంట్ల మాధవ్ చర్యల కారణంగా హిందూపురం పేరు మసకబారుతుంది. 10 లక్షల పైచిలుకు జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక పార్లమెంట్ సభ్యుడు సభ్య సమాజంకు ఏమి సమాధానం చెప్తారని, అలాగే అతని తప్పులను ఎత్తి చూపే మీడియాను అసభ్యంగా మాట్లాడటం ఎంతవరకు సబబు అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ.. గోరంట్ల మాధవ్ గారు హిందూపురం పార్లమెంట్ ప్రజానీకానికి తక్షణం క్షమాపణ చెప్పి పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయాలని హిందూపురం నియోజకవర్గ జనసేన పార్టీ తరుపున ఆకుల ఉమేష్ డిమాండ్ చేసారు.