- పుస్తక రచయితను అభినందించిన వి.సి, రిజిస్ట్రార్
ఆంధ్ర కేసరి యూనివర్శిటీ తోబాటు ఇతర యూనివర్శిటీలలో ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం నందు మాస్టర్స్ డిగ్రీ (ఎం.పి.ఎడ్) చేస్తున్న విద్యార్థుల సౌకర్యార్థం ఆంధ్ర కేసరి యూనివర్శిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఐ.దేవీ వర ప్రసాద్ రచించిన “అడ్వాన్సింగ్ ఫిషియోలజీ, అప్లైడ్ స్టాటిస్టిక్స్ అండ్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్” పుస్తకాన్ని ఏ.కే.యూ ఉప కులపతి ప్రొఫెసర్ డి.వి.ఆర్.మూర్తి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి హరిబాబు తదితరులు సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వి.సి ప్రొఫెసర్ మూర్తి మాట్లాడుతూ డాక్టర్ దేవీ వర ప్రసాద్ రచించిన ఎం.పి.ఎడ్ మొదటి సెమిస్టర్ పుస్తకం విద్యార్థులకు కోర్సు పరంగానే కాకుండా ఇతరత్రా ఉద్యోగ అవకాశాలకు సంభందించి ఎంతగానో ఉపయోగ పడుతుందని అన్నారు. పాఠ్యాంశాలను సులభ శైలిలో అర్ధం చేసుకొని విద్యార్థులు పబ్లిక్ పరీక్షలకు తయారు కావడానికి ఈ పుస్తకం ఎంతగానో ఉపకరిస్తుందని ఏ.కే.యూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ హరిబాబు అన్నారు. ఈ సందర్భంగా వి.సి, రిజిస్ట్రార్ తదితరులు పుస్తక రచయిత డాక్టర్ దేవీ వర ప్రసాద్ ను మనస్ఫూర్తిగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏ.కే.యూ ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం అధ్యాపకులు ఏ.వెంకటేశ్వర్లు తోబాటు ఎం.పి.ఎడ్ మొదటి సెమిస్టర్ విద్యార్థులు, ఏ.కే.యూ సిబ్బంది పాల్గొన్నారు.
Share this content:
Post Comment