సీతానగరం మండలం రఘుదేవపురం గ్రామానికి చెందిన మామిడాల సుబ్రహ్మణ్యం కుమార్తె ఇటీవల జరిగిన ప్రమాదంలో చేతికి తీవ్ర గాయం కావడంతో రాజమండ్రి చక్రధర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ “నా సేన కోసం నా వంతు” రాష్ట్ర కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి శుక్రవారం హాస్పిటల్‌ను సందర్శించి చిన్నారిని పరామర్శించారు. తల్లిదండ్రులకు ధైర్యం చెప్పిన ఆమె, చిన్నారికి మెరుగైన చికిత్స అందించాల్సిందిగా వైద్యులను కోరారు. సామాజిక బాధ్యతగా జనసేన నేతలు చూపిస్తున్న స్పందనకు స్థానికంగా మంచి స్పందన వ్యక్తమవుతోంది.
Share this content:
Post Comment