పలు కుటుంబాలను పరామర్శించిన శ్రీమతి బత్తుల

  • మదిరెడ్డి శివ కుటుంబసభ్యులను పరామర్శించిన శ్రీమతి బత్తుల

సీతానగరం మండలం, కూనవరం గ్రామంలో మదిరెడ్డి శివ ఇటీవల స్వర్గస్తులైనారని తెలుసుకున్న రాజానగరం జనసేన పార్టీ నాయకురాలు నా సేన కోసం నా వంతు కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి శివ కుటుంబసభ్యులను పరామర్శించి మనోధైర్యం చెప్పి మాదిరెడ్డి శివకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వీరి వెంట జనసేన పార్టీ నాయకులు జనసేన పార్టీ ప్రెసిడెంట్ మాధవరపు వీరభద్రరావు, అడపా నరసింహం, మట్ట వెంకటేశ్వర రావు, మాగవరపు అర్జున రావు, చవిటిపల్లి లాలిబాబు, మదిరెడ్డి అయ్యప్ప, మదిరెడ్డి కృష్ణ, జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.

  • గెడ్డం కృష్ణారావును పరామర్శించిన శ్రీమతి బత్తుల

సీతానగరం మండలం, ముగ్గళ్ళ గ్రామంలో జనసేన పార్టీ మండల నాయకులు గెడ్డం కృష్ణారావు అనారోగ్యంతో బాదపడుతున్న విషయం తెలుసుకున్న రాజానగరం జనసేన నాయకురాలు నా సేన కోసం నా వంతు కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి శుక్రవారం వారిని పలకరించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వీరి వెంట జనసేన పార్టీ నాయకులు మట్ట వెంకటేశ్వరరావు, రుద్రం గణేష్, రుద్రం నాగేశ్వరావు, ప్రగడ అన్నారం, బొడపటి కరుణాకర్, పిండి వివేక్, కావలి గంగాధర్ రావు, దాసరి రమేష్, పన్నీరు రమేష్, అడ్డాల దొరబాబు, అడబాల బాబీ, జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.