కొండగుంటూరులో పలు కుటుంబాలను పరామర్శించిన శ్రీమతి బత్తుల

రాజానగరం నియోజకవర్గం: రాజానగరం మండలం, కొండగుంటూరు గ్రామంలో ఆదివారం పలు కుటుంబాలను ఆదివారం జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పరామర్శించారు. ముందుగా ఈలి ఆంజనేయులు నివాసం ఉంటున్న ఇల్లు ఇటీవల అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైపోవడం వలన నిరాశ్రయులు అయిన వారి కుటుంబాన్ని పలకరించి ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదే గ్రామానికి చెందిన గిరజాల భద్రాచల రాముడు ఇటీవల యాక్సిడెంట్ లో ప్రమాదవశాత్తు గాయపడిన విషయం తెలుసుకుని వారిని పలకరించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అనంతరం గిరిజాల నాగేంద్ర ఇటీవల స్వర్గస్తులయ్యారని తెలుసుకుని వారి కుటుంబసభ్యులను పరామర్శించి మనోదైర్యం చెప్పారు.
ఈ కార్యక్రమంలో వీరి వెంట అరిగెల రామకృష్ణ, జగత వీరభద్రరావు, ఈవూరి శ్రీనివాసరావు, కొత్తపల్లి రఘు, అగత్తి రజనీకాంత్, నంద్యాల కాళీ కృష్ణ, గిరిజాల దుర్గారావు, బుడ్డిగ ప్రసాద్, అడబాల బాబీ, అడ్డాల దొరబాబు, యర్రంశెట్టి పోలరావు మరియు జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.