సీతానగరంలో పలు కుటుంబాలకు శ్రీమతి బత్తుల ఆత్మీయ పలకరింపు

రాజానగరం నియోజకవర్గం: సీతానగరం మండలంలో పలు కుటుంబాలను జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పరామర్శించారు. వంగలపూడి గ్రామానికి చెందిన ఓలేటి సతీష్ ఇటీవల ప్రమాదవశాత్తు చనిపోయిన విషయం తెలుసుకుని వారి కుటుంబసభ్యులను పరామర్శించి మనోధైర్యం చెప్పడం జరిగింది. రఘుదేవపురం గ్రామానికి చెందిన జనసేన సీనియర్ నాయకులు ఎక్స్ ఎంపీటీసీ కవల గంగారావు అన్న గారైన కవల కోటేశ్వరరావు సతీమణి శ్రీమతి కవల సీతామహాలక్ష్మీ ఇటీవల స్వర్గస్తులైనారు అని తెలుసుకుని వారి కుటుంబసభ్యులను పరామర్శించి మనోధైర్యం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీరి వెంట జనసేన నాయకులు చీకట్ల వీర్రాజు, మట్ట వెంకటేశ్వరరావు, ప్రగడ శ్రీహరి, గట్టి సత్యనారాయణ మూర్తి, అడబాల బాబీ, దేవన దుర్గాప్రసాద్ (డి డి), మరియు జనసైనికులు పాల్గొన్నారు.