జనసేనలో చేరిన శ్రీమతి ఎంగనూరి సత్యవతి

మంగళగిరి: స్వర్ణాంధ్ర ప్రదేశ్ ధ్యేయంగా పరితపిస్తూ, నిరంతరం ప్రజా సంక్షేమాన్నే కోరుకునే గొప్ప నాయకుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు, భావాజలాలు నచ్చి అనంతపురం జిల్లా కదిరికి చెందిన ప్రముఖ స్వాతంత్ర్య ఉద్యమనేత గాజుల నరసయ్య కుమార్తె శ్రీమతి ఎంగనూరి సత్యవతి రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఆకేపాటి సుభాషిణి ఆధ్వర్యంలో పార్టీలో చేరడం జరిగింది. అధినేత పవన్ కళ్యాణ్ గారు వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించడం ఎంతో సంతోషకరం.