అనారోగ్యంతో బాధపడుతున్న బాధితులకు అండగా శ్రీమతి కాంతిశ్రీ

ఎచ్చెర్ల నియోజకవర్గం: రణస్థలం మండలం, అల్లివలస గ్రామంలో గుంటు జానీ, ఎర్రమ్మ దంపతుల చెందిన కుమార్తె చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుంది. స్థానిక జనసైనికుల ద్వారా విషయం తెలుసుకున్న ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి కాంతిశ్రీ గురువారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బస్వ గోవింద్ రెడ్డి, శ్రీ వడ్డాది శ్రీనివాసరావు, గొర్ల సూర్య, బలరాం, కాకర్ల బాబాజీ, లక్ష్మీనాయుడు, ఎర్రయ్య, గణ, జనసైనికులు, నాయకులు పాల్గొన్నారు.