అగ్నిప్రమాద బాధితులకు అండగా శ్రీమతి లోకం మాధవి

నెల్లిమర్ల, భోగాపురం మండలంలోని, చోడుపిల్లి పేట గ్రామంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించడంతో ఇల్లు దగ్ధమై 2 లక్షల ఆస్తినష్టం జరగడంతో, విషయం తెలుసుకున్న జనసేన-తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి శ్రీమతి లోకం మాధవి సంఘటన స్థలానికి హుటాహుటిన చేరుకొని బాధితులను పరామర్శించి నిత్యవసర వస్తువులు అందజేసి ఆర్థిక సహాయం చేశారు. అలానే బాధితులకు భవిష్యత్తులో అండగా ఉంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముక్కం పంచాయతీ నాయకులు మైలపల్లి అనిల్ కిరణ్, బడి జీకే, బడే అనిల్ మరియు వందనాలు రమణ, పల్లా రాంబాబు, పల్లంట్ల జగదీష్ తదితరులు పాల్గొన్నారు.