డొక్కా సీతమ్మ చలివేంద్రాన్ని ప్రారంభించిన శ్రీమతి మాకినీడి శేషుకుమారి

కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలోని, గవర్నమెంట్ హాస్పిటల్ సెంటర్ లో పిఠాపురం టౌన్ జనసేన పార్టీ ప్రెసిడెంట్ బుర్రా సూర్య ప్రకాష్ రావు మరియు పట్టణ కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన డొక్కా సీతమ్మ చలివేంద్రాన్ని ప్రారంభించేందుకు విచ్చేసిన పిఠాపురం నియోజవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి శ్రీమతి మాకినీడి శేషు కుమారిని ఆహ్వానించి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాకినీడి శేషుకుమారి చలివేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఆనంతరం శేషుకుమారి మాట్లాడుతూ ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ స్ఫూర్తితో వేసవి తాపానికి బాటసారులు, వాహనదారుల దాహార్తి తీర్చేందుకు ఏర్పాటు చేసిన చలివేంద్రం ఎంతో మందికి దప్పిక తీరుస్తుందని, చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన బుర్రా సూర్య ప్రకాష్ కు, కమిటీ సభ్యులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. జనసేన నాయకులు మాట్లాడుతూ డొక్కా సీతమ్మ పేరు మీద ఈ చలివేంద్రం పెట్టడం చాలా ఆనందంగా ఉందని, ఈ గవర్నమెంట్ హాస్పిటల్ కి వచ్చే పేషెంట్లకు, అలాగే దూరప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులకు దాహం తీర్చడం, అలాగే ఈ కార్యక్రమం ఎండాకాలం అంతా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డా. మాకినీడి వీరప్రసాద్, జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు, జిల్లా కార్యదర్శి మొగలి అప్పారావు, టౌన్ ప్రెసిడెంట్ బుర్రా సూర్య ప్రకాష్, టౌన్ మహిళా ప్రెసిడెంట్ కోలా దుర్గ, కసిరెడ్డి నాగేశ్వరరావు, బొజ్జ కుమార్, పెద్దిరెట్ల భీమేశ్వరరావు, పిట్ట చిన్న , పబ్బిరెడ్డి ప్రసాద్, నామా శ్రీకాంత్, తోట సతీష్, మణుగుల వెంకటేష్, మేడిపోయిన సత్యనారాయణ, జ్యోతుల వాసు, జ్యోతుల సీతారాంబాబు, యాండ్రపు శ్రీనివాస్, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.