అంగన్వాడీ ఉద్యోగుల దీక్షకు సంఘీభావం తెలిపిన శ్రీమతి పోలసపల్లి సరోజ చెరియన్

కాకినాడ రూరల్, గత ఐదు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ ఉద్యోగులు న్యాయబద్దంగా కోరుతున్న డిమాండ్ లు పరిష్కరించాలని చేస్తున్న దీక్షలో భాగంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సర్పవరం జంక్షన్ నందు గల ఎమ్మర్వో ఆఫీసు ప్రాంగణం లో అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న పోరాటానికి శనివారం జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కాకినాడ ప్రధమ మేయర్ శ్రీమతి పోలసపల్లి సరోజ మరియు కాకినాడ రూరల్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు శ్రీమతి పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్ రెడ్డి పాదయాత్రలో నా అక్క చెల్లెమ్మలు, అని ప్రగల్బాలు పలికిన ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2 లక్షల మంది నిరసన చేస్తుంటే పట్టించుకోకుండా జగన్ రెడ్డి ఉండడం బాధాకరం అన్నారు. కనీస వేతనం 26 వేలు చెల్లించాలన్న డిమాండ్, గ్రాట్యుటీ, పెన్షన్ డిమాండ్ లు అమలు చెయ్యాలని కోరారు. సుప్రీం కోర్టు ఆదేశాలు సైతం అమలు చెయ్యకపోవడం బాధాకరం అన్నారు. 3 నెలలలో రాబోయే జనసేన-టీడీపీ సంకీర్ణ ప్రభుత్వంలో అంగన్వాడీ డిమాండ్ లు తప్పక పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అంగన్వాడీ పనులను సచివాలయం ఉద్యోగుల చేత చేయించడం సిగ్గు చేటు అని, ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చెసే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని అన్నారు. జనసేన పార్టీ తరపున అంగన్వాడీ కార్యకర్తలకు పూర్తి మద్దతు ప్రకటించారు.