జనసేనలో చేరిన శ్రీమతి రేవతి

గంగాధర నెల్లూరు నియోజకవర్గం, కార్వేటి నగరం మండలం, వానదుర్గా పురం పంచాయతీలో చిత్తూరు జిల్లా వీరమహిళా విభాగం ఆధ్వర్యంలో జరిగిన వీరమహిళా సదస్సులో శ్రీమతి రేవతి జనసేన పార్టీలో చేరడం జరిగింది. రీజినల్ కోఆర్డినేటర్ ఆకుల వనజ, రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి, నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న జనసేన కండువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా రేవతి మాట్లాడుతూ వైసీపీలో మహిళలకు రక్షణ లేదని, జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి, పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కోసం తన వంతు కృషి చేయడానికి సిద్ధమని, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధి చెందుతుందని, మహిళా సాధికారత సాధ్యం అవుతుందని, ఈ నియోజకవర్గంలో వీరమహిళా విభాగఒ పటిష్టతకు సాయశక్తులా కృషి చేస్తానని ఈ సందర్భంగా రేవతి తెలిపారు.