పల్లె పథాన జనసేన కార్యక్రమంలో పాల్గొన్న శ్రీమతి తంబళ్లపల్లి

నందిగామ నియోజకవర్గం: వీరులపాడు మండలం, జూజ్జురు గ్రామం నందు మంగళవారం నందిగామ జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీమతి తంబళ్లపల్లి రమాదేవి ఆధ్వర్యంలో జూజ్జురు గ్రామ ప్రజలతో గాజు గ్లాసుతో చాయ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా రమాదేవి మాట్లాడుతూ ప్రతి సామాన్య వ్యక్తికి, ఉదయం టీ గ్లాసుతోనే పలకరింపు మొదలవుతుంది. అలాగే టీ త్రాగడం వలన ప్రతి కార్మికుడు రెట్టింపు ఉత్సాహంతో పని చేసుకుంటారని, అలాగే జనసేన పార్టీ సింబల్ అయిన గాజు గ్లాసు ప్రజల్లోకి వెళ్ళేవిధంగా గాజు గ్లాసుతో చాయ్ కార్యక్రమం చేపట్టామని మరియు నందిగామ నియోజకవర్గంలోని ప్రజలు నిత్యం గ్రామంలో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. తమ దృష్టికి ప్రతి చోట అనేక సమస్యలు వస్తున్నాయ్యన్నారు. సాయంత్రం వీరులపాడు మండలంలో పల్లె పథాన జనసేన కార్యక్రమంలో భాగంగా బోడవాడ, జమ్మవరం, గోకరాజుపల్లి గ్రామాల్లో పర్యటించారు. జనసైనికులు భారీ ర్యాలీతో స్వాగతం పలికారు. ఈ సందర్బంగా రమాదేవి మాట్లాడుతూ గ్రామస్తులు తమకి కనీస సౌకర్యాలు లేవంటూ రమాదేవి గారికి చెప్పుకొని వాపోయారన్నారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి దశబ్ద కాలంగా ఎన్నో అటుపోట్లు తట్టుకొని ప్రజలకోసం నిలబడుతున్నారన్నారు. ప్రభుత్వ స్కూల్ లో చదువుకుంటున్న విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం అద్వానంగా ఉన్నదని విద్యార్థుల తమ దృష్టికి తీసుకు వచ్చారని, కోడిగుడ్డులల్లో నురగ వస్తుందని చెప్పారు. పసి పిల్లలకు ఇస్తున్న ఆహారంలో కూడా ఈ ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహారిస్తుదని ఆగ్రహం వ్యక్తం చేసారు. సమస్యలు విన్న రమాదేవి బాధితులకు అండగా ఉంటానని భరోసానిచ్చారు. జగన్ ప్రభుత్వాన్ని గద్దెదింపేవరకు మా ఈ పోరాటం ఆగదు అన్నారు. జనసేన కూటమి ప్రభుత్వాన్ని స్థాపించాలన్నారు. ఈ కార్యక్రమంలో వీరులపాడు మండల అధ్యక్షులు బేతపూడి జయరాజు, పొన్నవరం వార్డ్ మెంబెర్ పసుపులేటి శ్రీనివాసరావు, కూడుపుగంటి రామారావు, సురా సత్యన్నారాయణ, పురంశెట్టి నాగేంద్ర మరియు వివిధ గ్రామాల జనసైనికులు, జనసేన నాయకులు, వీరమహిళలు పాల్గొన్నారు.