దళితుల సంక్షేమానికి పాటుపడే వ్యక్తి పవన్ కళ్యాణ్: శ్రీమతి లోకం మాధవి

నెల్లిమర్ల నియోజకవర్గ నాయకురాలు శ్రీమతి లోకం మాధవి సోమవారం నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. సోమవారం ఉదయం ఉపాధి హామీ పథకంలో భాగంగా పనిచేస్తున్న డెంకాడ మండలం జొన్నాడ గ్రామానికి చెందిన ప్రజలను కలిసారు. ఉపాధి హామీ కూలీలతో ముచ్చటించిన మాధవి నియోజకవర్గంలో వైసిపి ప్రభుత్వం వచ్చాక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజలకు వివరించి, వచ్చే ఎన్నికల్లో ఆ తప్పు జరగకుండా ప్రతి ఒక్కరూ ఆలోచించి ఒక మంచిమనిషి, ప్రజల పక్షపాతి అయిన పవన్ కళ్యాణ్ కి వచ్చే ఎన్నికల్లో మద్దతు తెలియజేయాలని కోరారు. లోకం మాధవి మాట్లాడుతూ మరోసారి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలు ఆంధ్రప్రదేశ్ ని విడిచిపెట్టి వెళ్లే రోజులు వస్తాయని ప్రజలకు గుర్తు చేశారు. బొడ్డుకొండ లాంటి నాయకులు ప్రజలకు సేవ చేయకుండా, భూకబ్జాలకు పాల్పడుతున్నారని, స్థానికంగా వచ్చే సంస్థలలో వాటాలను అడుగుతున్నారని ఇదేంటి అని ప్రశ్నిస్తే వారిని భయబ్రాంతులకు గురి చేస్తున్నారని లోకం మాధవి మండిపడ్డారు. సోమవారం సాయంత్రం పూసపాటిరేగ మండలంలోని భరిణికం వెళ్లిన లోకం మాధవి ఉపాధి హామీ పథకంలో భాగంగా పనిచేస్తున్న గ్రామస్తులను అడిగి వారి సమస్యలు తెలుసుకున్నారు. మాధవి ప్రజలతో మాట్లాడుతూ జనసేన ప్రభుత్వం స్థాపించి తాను శాసన సభ్యురాలిగా నెల్లిమర్ల నియోజకవర్గ ప్రజలు దీవిస్తే, తాను నియోజకవర్గంలోని మొట్టమొదటిగా చేసే కార్యక్రమం ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికి రక్షిత మంచినీటి కులాయిని ఏర్పాటు చేయిస్తానని ప్రజలకు మాటిచ్చారు. అలాగే తాను ఒక చదువుకున్న మహిళ అని కాబట్టి తాను చదువుకు ఎంతో ప్రాధాన్యత ఇస్తానని అందుకుగాను ప్రతి బడిలో మంచి వసతులతో కూడిన సదుపాయాలతో సహా వారికి మంచి మధ్యాహ్న భోజనం అందించేలా తను చొరవ తీసుకుంటానని తెలియజేశారు. అలాగే ఈ ప్రాంతానికి ఎన్నో పరిశ్రమలు తెచ్చి నెల్లిమర్ల నియోజకవర్గం యువతకు అండగా నిలిచేలా ఉపాధి కలగ చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే ఈరోజు ప్రాథమిక చికిత్స సామాన్య ప్రజలకు ఎంతో కరువైందని, జనసేన అధికారంలోకి వస్తే ప్రజలందరికీ ఆసుపత్రులు అందుబాటులో ఉండేలా తాను చూస్తానని తెలియజేశారు. పూసపాటిరేగ మండలంలోని కనిమెట్ట, చోడవరంలోని దళిత వాడలను సందర్శించిన లోకం మాధవి అక్కడి ప్రజలతో మమేకమై దళితులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆరా తీశారు. దళితవాడలోని ప్రజలతో మాట్లాడిన లోకం మాధవి. వచ్చే ఆదివారం నియోజకవర్గంలో తలపెట్టబోయే దళిత మహాగర్జన సభకు వారందరూ విచ్చేసి విజయవంతం చేయాలని కోరారు. మాధవి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఎప్పుడూ దళితుల సంక్షేమానికి పాటుపడే వ్యక్తి అని వారి హక్కులను పరిరక్షించే నాయకుడని అలాంటి వ్యక్తిని వచ్చే ఎన్నికల్లో ప్రజలు గెలిపించాలని వారిని కోరారు. చివరిగా చోడమ్మా అగ్రహారం గ్రామంలో పర్యటించన మాధవి గడపగడపకు తిరిగి ప్రజలని కలిసి వారిని వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీకి మద్దతు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.