ముక్కొల్లు గ్రామ చెరువును దోచుకుంటున్న మట్టి దొంగలు: ఎస్ వి బాబు సమ్మెట

పెడన, అగ్గిపుల్ల, సబ్బు బిళ్ళ, కుక్కపిల్ల కాదేది కవితకు అనర్హం అన్నారు శ్రీశ్రీ. వాగులు, వంకలు, గ్రామ చెరువులు, ప్రభుత్వ భూములు, పట్టా భూములు కాదేవి మట్టి దొంగతనానికి అనర్హం అంటున్నారు మట్టి దొంగలు. గూడూరు మండలం ముక్కోలు గ్రామంలోని గ్రామానికి సంబంధించిన చెరువును మట్టి దొంగలు అడ్డగా చేసుకుని రోజుకు వందలకొద్దీ టాక్టర్ ల మట్టిని అక్రమ రవాణా చేస్తున్నారు. సామాన్యుడు తమ ఇంటి అవసరం కోసం, పశువుల పాక బరంతు కోసమో 10 ట్రాక్టర్ల మట్టి తోలాలంటే సవాలక్ష అభ్యంతరాలు పెట్టే రెవెన్యూ సిబ్బంది వందల కొద్ది టాక్టర్ల నిత్యం అక్రమంగా తరలిస్తుంటే కళ్ళప్పగించి చూస్తున్నారు.

  • కాసుల కక్కుర్తి? మంత్రి ఆదేశం?

మంత్రి జోగి రమేష్ పెడన నియోజకవర్గంలో మండలానికో మట్టి ఏజెంట్ నియమించి నియోజకవర్గంలోని మట్టిని కొల్లగొడుతున్నాడు. ఇది నా మాట కాదు మట్టి మాఫియా సిండికేట్ మాట. “మేము డబ్బులు ఇచ్చాం ఈ మండలంలో మట్టి తోలుకునే హక్కు మాకే ఉందని బహిరంగంగా మట్టి మాఫియా చెబుతుంది.” రెవెన్యూ శాఖ నిర్లక్ష్యం, మంత్రి అండదండలతో ప్రతిరోజు వేలాది టిప్పర్ల మట్టి నియోజకవర్గంలో దాటిపోతుంది. జనసేన పార్టీ ఎన్ని పోరాటాలు చేసిన రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరితో మట్టి దోపిడిని అడ్డుకట్ట వెయ్యలేకపోతున్నాం. ప్రజలను చైతన్య పరుస్తాం, మట్టి విలువను తెలియజేస్తాం. మట్టి అక్రమ రవాణా వల్ల, మన ప్రాంతానికి, ప్రకృతికి జరిగే నష్టాన్ని వివరిస్తామని పెడన నియోజకవర్గ జనసేన నాయకులు ఎస్ వి బాబు సమ్మెట అన్నారు.