గుడ్లవల్లేరు రహదారుల దుస్థితిపై నిరసన గళమెత్తిన జనసేన

రాష్ట్ర ఆధినాయకులు పవన్ కళ్యాణ్ అదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రోడ్లను పట్టించుకోండి సీఎం సర్ అంటూ కృష్ణా జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామ కృష్ణ మరియు ముదినేపల్లి మండల అధ్యక్షులు వీరంకి వెంకటేశ్వర రావు ఆధ్వర్యంలో కైకలూరు నియోజకవర్గం, ముదినేపల్లి మండలం జనసేన నాయకులు #GoodMorningCMSir అనే హ్యాష్ ట్యాగ్ తో డిజిటల్ కాంపెయిన్లో భాగంగా నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిద్ర లేవండి సీఎం సార్.. నిద్ర లేవండి ఎమ్మెల్యే సార్ అంటూ ముదినేపల్లి-గుడ్లవల్లేరు ప్రధాన రహదారి తీరును చూసి నిరసన గళం ఘనంగా వినిపించారు. ముదినేపల్లి మండల అధ్యక్షులు వీరంకి వెంకటేశ్వర రావు, కృష్ణా జిల్లా సంయుక్త కార్యదర్శి వేల్పూరి నానాజీ, మండల గౌరవ అధ్యక్షులు పోకల కృష్ణ, మండల నాయకులు, మండల కార్యవర్గ సభ్యులు భూపాల నాని, మండల జనసైనికులు అంబుల భరత్, పట్టపు గణేష్, మహమ్మద్ నజీర్, పట్టపు కొండా పాల్గొన్నారు..