పవన్ కళ్యాణ్ కి వరిధాన్యాలతో, పాలతో అభిషేకం చేసిన ముదినేపల్లి రైతులు

*కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి మండలం రైతులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి వరి ధాన్యాలతో, పాలతో అభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.

కైకలూరు, ఆత్మహత్య చేసుకుని చనిపోయిన రైతులకు 1లక్ష రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించి, చనిపోయిన రైతుల కుటుంబాలకు ధైర్యాన్ని ఇవ్వడం కోసం 5 కోట్ల రూపాయలు తన కష్టార్జితంను కేటాయించడంను హర్షిస్తూ, రైతుల గిట్టుబాటు ధర సమస్యల గురించి మాట్లాడిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి ఈరోజు ముదినేపల్లి మండల కౌలు రైతులు మరియు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ చిత్ర పటానికి వరి ధాన్యాలతో, పాలతో అభిషేకం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా రైతుకు న్యాయం జరగడం లేదని, ఏ అధికారం లేని పవన్ కళ్యాణ్ నేనున్నానని భరోసా ఇస్తూ లక్ష రూపాయలు ఆర్థిక సహాయం ఇవ్వడంపై రైతులు సంతోషం వ్యక్తం చేసి, పవన్ కళ్యాణ్ నాయకత్వంతోనే రైతుల సౌభాగ్యం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముదినేపల్లి మండల అధ్యక్షులు వీరంకి వెంకటేశ్వరరావు(వెంకయ్య), సంయుక్త కార్యదర్శి వేల్పూరు నానాజీ, పోగ్రామ్స్ కమిటీ మెంబర్ చెన్నంశెట్టి చక్రపాణి నియోజకవర్గ జనసేన నాయకులు పోకల కృష్ణ, మోటేపల్లి హనుమా, మండల నాయకులు అబ్బిశెట్టి నరేష్, కునపారెడ్డి రాజా, దాసరి నాగ ఆంజనేయులు, వడ్లని ఆంజనేయులు, గుడిసేవ సురేష్, భూపాల నాని, అనుకుమర్, భరత్, నాగేంద్ర, యర్రంశెట్టి శివప్రసాద్, పాశం శ్రీను, సూదాబత్తుల సాయీష్ లు మరియు జనసైనికులు పాల్గొన్నారు.