మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్బంగా నివాళులర్పించిన ముదినేపల్లి మండల జనసేన

ముదినేపల్లి, సామజిక ఉద్యమాల పితామహుడు మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్బంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు ముదినేపల్లి మండల జనసేన నాయకులు. ఈ సందర్బంగా మండల జనసేన నాయకులు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో ఈ రోజు ముందుకు వెళ్తున్నారు అంటే ఆది మహాత్మ జ్యోతి రావు పూలే స్ఫూర్తే అని, మొట్టమొదటగా ఆడవారికి చదువు నేర్పిన ఘనత ఆయనది అని అలానే మహారాష్ట్రలో ఎన్నో పాఠశాలలు పెట్టి, మహిళలకు చదువు నేర్పించారు. మహాత్మ జ్యోతిరావు పూలే సమాజంలో అందరు ఒక్కటే అని, ఈ సమాజంలో కుల వివక్ష ఉండకూడదు ఆయన ఎన్నో ఉద్యమాలు చేశారని, ఆయనకు నివాళులర్పించడం మన బాధ్యత అని అన్నారు. ఇలాంటి మహాత్ముల ఆశయాలను పాటిస్తూ వారి సేవా దృక్పధాన్ని ప్రస్తుత రాజకీయ నాయకుల్లో అలాంటి మహనీయులు స్ఫూర్తిని ముందు తీసుకుని వెళ్తున్న వ్యక్తి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక్కరే అని అన్నారు. ఈ కార్యక్రమంలో ముదినేపల్లి మండల జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.