కాపు రిజర్వేషన్ల కోసం తెగ పోరాడిన ముద్ర.. ఇన్నాళ్ళు పోతున్నావా గాఢ నిద్ర..

నెల్లూరు: కాపు రిజర్వేషన్ల కోసం తెగ పోరాడిన ముద్ర.. నమ్మి వెంట నడిచిన వారిని మభ్యపెట్టి ఇన్నాళ్ళు పోతున్నావా గాఢ నిద్ర.. అంటూ కాపు నాయకులు ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ గారిపై రాసిన బహిరంగ లేఖను ఖండిస్తూ జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వారి కార్యాలయంలో బుధవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వసంతకాలంలో కోయిల ఎన్నికల వేళ కుల నాయకులు కూడా స్వప్రయోజనాలు కోసం ఏదో కూయటం ప్రారంభిస్తారు.. కుల సమీకరణ కింద సర్దకుని ప్రజలను గొర్రెలు చేయాలని ప్రయత్నిస్తూనే ఉంటారు. వయసు అయిపోయి ఏదో వ్యాసాలు రాస్తున్న పెద్దమనిషి రామకోటి రాసుకుంటే పుణ్యమైనాదక్కుతుంది. ఇష్టమొచ్చినట్లు మా నాయకుడి గురించి మాట్లాడితే కాపు యువత ఉపేక్షించే పరిస్థితిలో లేదు. మీ బావ ప్రకటనలకు ఇదే సమయమా ఎన్నికలు ముందు ఉండడంతో డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టారు. నమ్మి తోడు నడిచిన వారి అందరి ఆశలపై నీళ్లు చల్లారు. ఆ తర్వాత కనిపించింది కూడా లేదు మళ్ళీ ఈరోజు వచ్చి ఏదో చెప్తున్నారు. ఎవరి ముద్రగడ పద్మనాభం ఈయన పార్టీకి గాని మరియు కులానికి గాని ఏమైనా చేశారా అని యువకులు అడుగుతున్నారు.
నేను కూడా గత తొమ్మిది సంవత్సరాల నుంచి రాజకీయంగా రాజకీయ ప్రత్యర్థులను సమర్దించిందిగాని వ్యతిరేకించింది గాని చూడలేదు. మంత్రిగా ఉన్నప్పుడు మాత్రం కాపులకు ప్రవేశం లేదు అని పెట్టిన ఈయన కూడా మాట్లాడుతున్నారు. వైసీ నాయకులు వైసిపి నాయకులు అనేక సందర్భాల్లో కాపు నా కొడుకులని మరియు నా అమ్మా మొగుడు అని దుర్భాషలాడడం తమరికి కనపడలేదా. కాకినాడలో ఆడపడుచుల్ని ఇష్టమొచ్చినట్లు మాట్లాడి వారిపై దాడి చేసిన పరిస్థితి తమ కళ్ళకి కనపడ లేదా.. ఆరోజు రిజర్వేషన్ల కోసం పోరాడిన తమరు ఖరాకండిగా కాపులకు రిజర్వేషన్ ఇవ్వలేము అని చెప్పినప్పుడు తమ నోరు మూగబోయిందా…లేక బహిరంగ లేఖ రాయటానికి చేయి పనిచేయ లేదా. కాపు బిడ్డలకు విదేశీ విదేశీయులు విదేశంలో చదువుకోడానికి ఏర్పాటు చేస్తా అన్న రుణ కార్యం కల్పించలేకపోయిందీ వైసీపీ ప్రభుత్వం దానికి ప్రశ్నించడానికి తమకి జ్ఞానం లేకుండా పోయింది. తమరు మనోభావాలు దెబ్బతింటే మడిచి జేబులో పెట్టుకోగలరు, మా నాయకుడిని ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఉపేక్షించేది లేదు. కులమతాలకు అతీతంగా యువత పవన్ కళ్యాణ్ గారిని ఫాలో అవుతున్నారు వారు గెలవాలని కోరుకుంటున్నారు. కలిసి పోటీ చేస్తామని సీఎం వేరొకరని మీకు ఎవరైనా చెప్పారా.. మోసం చేసావ్ అని మరొకసారి మాట్లాడితే మర్యాదగా ఉండదు. పెద్ద మనిషి అని కూడా చూడకుండా మాట్లాడాల్సి వస్తుంది జాగ్రత్త.. అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ తో కాపు సంక్షేమ సేన వర్కింగ్ ప్రెసిడెంట్ సుధా మాధవ్, శివ, సురేష్, కేశవ, రమేష్, ప్రతాప్, హరి, ఖలీల్, సుమంత్, వెంకీ, తేజ తదితరులుపాల్గొన్నారు.