ముద్రగడ కాపు జాతిమిద పడ్డ ముద్ర

  • తుని వద్ద రత్నచల్ రైలు ప్రమాదం యావత్ కాపు జాతిపై పడింది
  • పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదుగుతారు
  • ఆంధ్రప్రదేశ్ తూర్పుకాపు సంఘ రాష్ట్ర నాయకులు మత్స పుండరీకం, బి.పి.నాయుడు
  • మీ పాలేరు తనం తాలూకు భావజాలాలను జనసేనానిపై రుద్దకండి..

పాలకొండ నియోజక వర్గం: ముద్రగడ పద్మనాభం గారు సుదీర్ఘ మీ ఉద్యమం తాలూకు ఆకాంక్ష నెరవేరక ముందే కాపులను నెట్టేట ముంచేసి కాపు ఉద్యమం నుంచి తప్పుకున్నవు ఎందుకు? అని జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు, ఆంధ్రప్రదేశ్ తూర్పుకాపు సంఘ రాష్ట్ర నాయకులు మత్స పుండరీకం, బి.పి.నాయుడులు ప్రశ్నించారు?. పవన్ కళ్యాణ్ గారికి మీరు రాసిన లేఖ చూసిన తర్వాత మీరంటే అసహ్యం కలుగుతుంది. కాపు ఉద్యమాన్ని ముద్రగడ తాకట్టు పెట్టాడు అని అనేకమంది అంటున్నా నమ్మలేదు కానీ ఇప్పుడు నమ్మాము. పవన్ కళ్యాణ్ గారిని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి అసభ్య పదజాలాలతో తిట్ల దండకం ఎత్తుకున్న రోజున మీరు ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి రాసినట్లు ఆరోజు ద్వారంపూడికి ఎందుకు లేఖ రాయలేదు.?. ద్వారంపూడి అవినీతిని దుర్మార్గాలను ఎండగట్టినప్పుడు జనసేన పార్టీ ఆడపడుచులను, కార్యకర్తలను ద్వారంపూడి గుండాలు బాహాటంగా కొట్టినప్పుడు ముద్రగడ ఎందుకు ఖండించలేదు?.
గతంలో మీరు ఎప్పుడు, ఏ సభలోను ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గానీ, అతని కుటుంబ సభ్యులు గానీ కాపు ఉద్యమానికి సహాయం చేసినట్లు వెల్లడించలేదు. అసందర్భోచితంగా ఇప్పుడు వెల్లడించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో ముద్రగడ మీరే చెప్పాలి అని మత్స పుండరీకం, బి.పి.నాయుడులు అన్నారు. ప్రస్తుత తరుణంలో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మార్చగల ఏకైక సమర్థవంతమైన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ప్రజాహితం, జనహితం అన్ని వర్గాల సమ్మతితో పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదుగుతారు అనేది మా ప్రగాఢ నమ్మకం. అపార రాజకీయ అనుభవం, సుదీర్ఘ కాల ఉద్యమ స్ఫూర్తి మీలో ఉంటే దయచేసి రాజకీయ అజ్ఞానిలా ప్రవర్తించకు ముద్రగడ? అన్నారు. కాపులు రాజ్యాధికార దిశగా అడుగులు వేస్తున్న శుభ తరుణంలో మీ పాలేరు తనం తాలూకు భావజాలాలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిపై రుద్దకండి. మీరు మరింత దిగజారి మిమ్ములను బాహాటంగా విమర్శలు చేసే అవకాశం ఇవ్వకండి. ముద్రగడ గారు మీమీద పడ్డ రత్నచల్ రైలు ప్రమాదం ముద్ర యావత్ కాపు జాతి మీద పడింది. నిస్వార్ధప్రయోజనం కోసం కాపు రిజర్వేషన్ ని ఆడ్డుపెట్టుకున్నావు. ఈ నాలుగేళ్ళ వైస్సార్సీపీ ని ఎందుకు ప్రశ్నింలేదు?. సీఎం జగన్ కి ఎందుకు లేఖ రాయలేదు?. కాపు సామాజిక వర్గానికి సమాధానం చెప్పు ముద్రగడా అని మత్స పుండరీకం, బి.పి. నాయుడులు మీడియా ముఖంగా ప్రశ్నించారు.
ముద్రగడ గారు కాపు రిజర్వేషన్ ఏమి అయ్యింది?. కాపు ఉద్యమం పేరిట తుని రైళ్లు దుర్ఘటనకు కారకులు ఎవరు?. దీనిపై లేఖలు రాయండి ముద్రగడ? అని మత్స పుండరీకం, బి. పి.నాయుడు ప్రశ్నించారు.