పిఠాపురం: జనసేన ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు

పిఠాపురం: సంక్రాంతి సందర్భంగా కనుమ పండుగ రోజు, సోమవారం గొల్లప్రోలు మండలం, చేబ్రోలు గ్రామంలో రథంబాట వీధిలో నూకాలమ్మగుడి నుండి పెదచెరువు వరకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు, జనసైనికుల ఆహ్వానం మేరకు ముఖ్యఅతిథిగా పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి శ్రీమతి మాకినీడి శేషుకుమారి హాజరయ్యారు.