నామినేషన్ దాఖలు చేసిన ముయ్యబోయిన ఉమాదేవి

తెలంగాణ, అశ్వరావుపేట నియోజకవర్గంలో స్థానిక అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ కు అశ్వరావుపేట నియోజకవర్గంలో బిజెపి బలపరిచిన జనసేన అభ్యర్థి ముయ్యబోయిన ఉమాదేవి శుక్రవారం నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాగంటి మురళీకృష్ణ, పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, జిల్లా కార్యదర్శి గడ్డమణుగు రవి కుమార్, సీనియర్ నాయకులు ఉమా, పోలవరం నియోజకవర్గ ఇన్చార్జి చిర్రి బాలరాజు, గోపాలపురం నియోజకవర్గం ఇంచార్జి సువర్ణరాజు పోలవరం నియోజకవర్గ ఏడు మండలాల అధ్యక్షులు పోలవరం నియోజకవర్గ ముఖ్య నాయకులు, మండలాల కమిటీలు గ్రామ కమిటీలు జనసైనికులు కార్యకర్తలు కలిసి అశ్వరావుపేట నియోజకవర్గం అభ్యర్థి ఉమాదేవిని కలిసి తమ మద్దతు తెలిపారు. అశ్వరావుపేట నియోజకవర్గంలో గిరిజన మహిళకు టికెట్ ఇవ్వడం తమకు ఎంతో సంతోషకరమైన విషయమని, పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా మహిళలకు పెద్దపీట వేస్తారని, ఉమాదేవిని అఖండ మెజారిటీతో గెలిపించాలని, తమకు పూర్తి మద్దతు ఉంటుందని బిజెపి జనసేన కూటమిలో అఖండ మెజారిటీతో దూసుకు వెళ్ళాలన్నారు. భారీ ర్యాలీగా నామినేషన్ వేశారు. బీజేపీ జనసేన పార్టీలు కలిసి పనిచేసి ప్రభుత్వ చేసే అరాచకాలు అరికట్టే విధంగా పోరాడి ప్రజల పక్షాన నిలబడాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు దుంపటి శ్రీనివాస్, వీరమహిళలు, జనసైనికులు భారీగా పాల్గొన్నారు.