*ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగాలను వివరించిన ఏ.కే.యూ వైస్ ఛాన్సలర్
ఆధునిక కంప్యూటర్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏ.ఐ) అనేక ప్రయోజనాలను అందిస్తున్నదని, విద్యార్థులు దీనిపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఆంధ్ర కేసరి యూనివర్శిటీ (ఏ.కే.యూ) వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డి.వి.ఆర్. మూర్తి పేర్కొన్నారు. కంప్యూటర్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో “ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్” అంశంపై నిర్వహించిన అతిథి ఉపన్యాస కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమానికి ఏ.కే.యూ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రాజ మోహన్ రావు అధ్యక్షత వహించారు. విదేశీ అతిథి ఉపన్యాసకుడిగా మాక్సీమస్ (యూ.ఎస్.ఏ) లోని సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎం. కిరణ్ బాబు పాల్గొని, ఏ.ఐ విద్య, వైద్యం, వ్యాపారం, ఉపాధి రంగాలలో విస్తృతంగా వృద్ధి చెందుతున్న విధానాన్ని వివరించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి. హరిబాబు మాట్లాడుతూ, ఏ.ఐ ప్రాముఖ్యత పెరుగుతున్నందున విశ్వవిద్యాలయ స్థాయి వరకు ప్రత్యేక కోర్సులు అందుబాటులోకి తెచ్చే చర్యలు జరుగుతున్నాయన్నారు. కార్యక్రమం ముగిసిన అనంతరం, విదేశీ ఉపన్యాసకుడు ఎం. కిరణ్ బాబును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Share this content:
Post Comment