మల్టీస్టారర్‌…మల్టీగెటప్స్

ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి నిర్మిస్తున్న మల్టీస్టారర్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’  (రౌద్రం రణం రుధిరం). ఈ సినిమాలో ఎన్టీఆర్‌ కొమరం భీమ్, రామ్‌ చరణ్‌ అల్లూరి సీతారామరాజు పాత్రల్లో కనిపించనున్నారు. ఈ ఇద్దరు హీరోలు సినిమా మొత్తంలో మరికొన్ని గెటప్స్‌లోనూ కనిపిస్తారట. బ్రిటిష్‌ అధికారులను ఎదుర్కొనే ప్రయత్నంలో రకరకాల గెటప్స్‌ వేసి వాళ్లను తెలివిగా ఎదుర్కొంటారని సమాచారం. పోలీస్‌ ఆఫీసర్‌గా చరణ్, బందిపోటు గెటప్‌లో ఎన్టీఆర్‌ కనిపిస్తారట. ఈ స్పెషల్‌ గెటప్స్‌ సినిమాకి అదనపు ఆకర్షణగా ఉంటాయట. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరిస్, చరణ్‌కు జోడీగా బాలీవుడ్‌ నటి ఆలియా భట్‌ నటించనున్నారు. కరోనా కారణంగా ఆగిన షూటింగ్‌ త్వరలోనే తిరిగి సెట్స్‌ మీదకు వెళ్లనుంది.