మూసాపేట్ డివిజన్లో ముమ్మారెడ్డి ఎన్నికల ప్రచారం

తెలంగాణ, కూకట్పల్లి, మూసాపేట్ డివిజన్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ముందుగా హనుమాన్ టెంపుల్ నందు పూజలు నిర్వహించి, రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి ఇందిరా గాంధీ విగ్రహం సెంటర్, గాంధీ విగ్రహం సెంటర్, యాదవ్ బస్తి, అంబేద్కర్ నగర్, చైతన్య బస్తి, గౌతమి స్కూల్ మీదుగా, మార్కెట్ రోడ్డు, మైసమ్మ టెంపుల్, హనుమాన్ చౌక్ వరకు భారీ ర్యాలీతో పాదయాత్ర కొనసాగింది. గెలుపే లక్ష్యంగా కూకట్పల్లి నియోజకవర్గంలో బిజెపి, జనసేన కార్యకర్తలు కలిసి భారీ జన సందోహం మధ్య మూసాపేట్ డివిజన్ ప్రజలు స్వచ్ఛందంగా పాదయాత్రలో అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు నోట ఒకటే మాట ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ గెలుపు తథ్యం అని ఆదిశగా ప్రయాణం కోనసాగుతుందని అన్నారు. ఇంటింటికి ప్రచారం చేస్తూ, కరపత్రాలను పంచుతూ మనందరి గుర్తు గాజు గ్లాస్ గుర్తు మీ అమూల్యమైన ఓటును వేసి కూకట్పల్లి నియోజకవర్గంలో బిజెపి బలపరిచిన జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నన్ను గెలిపించాలని మూసాపేట్ డివిజన్ ప్రజలను కోరారు. నేను గెలిచిన తర్వాత మూసాపేట్ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి స్థానిక సమస్యల పైన పరిష్కారం చూపే విధంగా పనిచేస్తానని మీ అందరికీ తెలుపుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో మాధవరం కాంతారావు, మూసాపేట్ కార్పొరేటర్ మహేందర్, శ్రీకర్ రావు, మనోహర్, ఎ.సూర్య రావు, గంగాధర్ గౌడ్, యంజాల పద్మయ్య, శైలేష్, కిషోర్, నాగేంద్ర, శంకర్, మండలి దయాకర్, రాజేష్, మహేష్, జనసేన పార్టీ నాయకులు,కార్యకర్తలు బిజెపి నాయకులు, కార్యకర్తలు, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.