కూచిపూడి నృత్య ప్రదర్శన చేసిన చిన్నారులకు బహుమతులు అందజేసిన ముమ్మారెడ్డి

శతఘ్ని న్యూస్: కూకట్‌పల్లి, అల్లాపూర్ డివిజన్, వివేకానంద నగర్ లో కెళ్ళ వెంకట్రావు ఆధ్వర్యంలో నిర్వహించబడిన కూచిపూడి నృత్య ప్రదర్శన కార్యక్రమమునకు కూకట్‌పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొని నృత్య ప్రదర్శన తిలకించి చిన్నారులకు బహుమతులు ప్రధానము చేశారు. ఈ సందర్భంగా ప్రేమ కుమార్ మాట్లాడుతూ భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే ఇటువంటి కూచిపూడి నృత్య ప్రదర్శనలు నేటి సమాజంలో ఎంతో అవసరం అని, ఈ కూచిపూడి నృత్య ప్రదర్శనకు శిక్షణ ఇచ్చే గురువులకు మరియు నృత్య ప్రదర్శన చేసిన చిన్నారులను, చిన్నారులను ప్రోత్సహిస్తున్న వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జనసేన నాయకులు కొల్లా శంకర్, అడపాల షణ్ముఖ, పవన్ నాయుడు, పోలబోయిన శ్రీనివాస్, బిజెపి నాయకులు రాము తదితరులు పాల్గొన్నారు.

WhatsApp-Image-2025-02-17-at-12.11.37-PM-1024x768 కూచిపూడి నృత్య ప్రదర్శన చేసిన చిన్నారులకు బహుమతులు అందజేసిన ముమ్మారెడ్డి

Share this content:

Post Comment