మే డే సందర్భంగా కార్మికులను సన్మానించిన ముమ్మారెడ్డి ప్రేమ కుమార్

కూకట్ పల్లి: అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం మే డే సందర్భంగా కూకట్పల్లి నియోజకవర్గంలోని 5వ ఫేస్ జనసేన పార్టీ ఆఫీస్ వద్ద జి హెచ్ ఎం సీ కార్మికులకు శాలువా వేసి సన్మానించి అనంతరము అల్పాహారము అందించినారు. హక్కుల కోసం పోరాడిన కార్మికుల విజయ గీతిక.. శ్రమజీవుల సంఘటిత శక్తికి ప్రతీక మేడే కార్మిక సోదర సోదరిమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రేమ కుమార్ మాట్లాడుతూ ప్రజల శ్రమను రోజులకొద్దీ దోచుకున్న సమయంలో మేము మనుషులమే మా శక్తికి కూడా పరిమితులు ఉంటాయని. ఈ చాకిరి మేము చేయలేమని పనిముట్లు క్రింద పడేసి 8 గంటల పని దినం కోసం పోరాటాలు చేశారని, చివరకు ప్రాణాలు సైతం త్రుణప్రాయంగా త్యాజించడం కార్మిక వర్గ పోరాటానికి నిదర్శనమని. 1923లో మొదటిసారిగా భారత దేశంలో మేడే పాటించడం జరిగినదని, దేశాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపించే కార్మికులే ఈ దేశానికి పట్టుకొమ్ములని, తమ కష్టముతో సమాజ సంపదను పెంచేది కార్మికులేనని, శ్రామికులు తమ హక్కులను సాధించుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి జనసేన పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ కొల్లా శంకర్, డివిజన్ ప్రెసిడెంట్ కలిగినడి ప్రసాద్, అంజి, పులగం సుబ్బు, సత్య సాయి, గుణశేఖర్, నవీన్, మోటిపల్లి శివ, మారుతి, చిన్నందేవ సహాయం తదితరులు పాల్గొన్నారు.