అంబేద్కర్ జయంతి వేడుకలలో పాల్గొన్న ముమ్మారెడ్డి ప్రేమ కుమార్

కూకట్పల్లి: రాజ్యాంగ రూప కర్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా కూకట్పల్లి జనసేన పార్టీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ ముఖ్యఅతిథిగా నియోజకవర్గంలోని పలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా కేపిహెచ్బి కాలనీ 5వ ఫేస్ నందు జనసేన పార్టీ నూతన కార్యాలయం ప్రారంభించి, అంబేద్కర్ చిత్ర పటమునకు పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం మోతీ నగర్ లో అంబేద్కర్ విగ్రహమునకు, మూసాపేట్ చిత్తారమ్మ గుడి ఎదురుగా జనతా నగర్ వద్ద అంబేద్కర్ విగ్రహముసకు, మూసాపేట్ వై జంక్షన్ వద్ద దళిత ఐక్యవేదిక వారు నిర్వహిస్తున్న అంబేద్కర్ విగ్రహమునకు, తెలంగాణ దళిత సంక్షేమ సంఘం రాష్ట్ర శాఖ వారు నిర్వహిస్తున్న మేడ్చల్ జిల్లా బాలానగర్ లోఅంబేద్కర్ విగ్రహమునకు, బోయినపల్లి అంబేద్కర్ విగ్రహమువకు, ⁠ బేగంపేట్ అంబేద్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు అంబేద్కర్ విగ్రహమునకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సంధర్భంగా ప్రేమ కుమార్ మాట్లాడుతూ అంటరాని వారిపై వివక్షను రూపుమాపడానికి మరియు స్త్రీలు మరియు కార్మికుల హక్కుల కోసం పోరాడటానికి అతను తన జీవితాన్ని అంకితం చేశాడు. అందుకే ఆయన జన్మదినాన్ని ‘సమానత్వ దినోత్సవం’ అని కూడా అంటారు అని గుర్తు చేశారు.భారత రాజ్యాంగానికి ప్రధాన రూపశిల్పిగా డాక్టర్ అంబేద్కర్ పాత్రను కీర్తించారు, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం మరియు సౌభ్రాతృత్వ సూత్రాలను సమర్థించే రాజ్యాంగాన్ని రూపొందించడంలో ఆయన చేసిన కృషిని గుర్తు చేశారు. ఈ కార్యక్రమములో కూకట్పల్లి నియోజకవర్గం లోని జనసేన నాయకులు, పలు అంబేద్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.