జనసేన జెండాను ఆవిష్కరించిన ముమ్మారెడ్డి ప్రేమ కుమార్

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో భాగంగా, బుధవారం ఉదయం కూకట్పల్లి నియోజకవర్గంలోని జనసేన పార్టీ కార్యాలయం (కె.పి.హెచ్.బి కాలనీ 5వ ఫేజ్) వద్ద జనసేన పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ జన శ్రేణులతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ జనసేన కార్యకర్తలకు, వీర మహిళలకు, ప్రజలకు జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. రాబోయే మార్చి 14న పిఠాపురం చిత్రాడలో జరుగనున్న జనసేన ఆవిర్భావ దినోత్సవ సభకు కూకట్పల్లి నియోజకవర్గం నుండి భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Share this content:

Post Comment