ఈటల రాజేందర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ముమ్మారెడ్డి

హైదరాబాద్, బీజేపీ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మల్కాజిగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ జన్మదినోత్సవం సందర్భంగా శామీర్ పేటలో మల్కాజిగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ నివాసంలో కూకట్ పల్లి నియోజకవర్గ జనసేన కంటెస్టెడ్ ఎమ్మెల్యే ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ ఈటెల రాజేందర్ ని మర్యాదపూర్వకంగా కలసి శాలువాతో సత్కరించి, పుష్ప గుచ్చం ఇచ్చి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేసిన వారిలో కూకట్పల్లి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు మండలి దయాకర్, కొల్లా శంకర్, అన్నపరెడ్డి వెంకటేశ్వరరావు, ఆవుల రంగబాబు, మధుసూదన్ రెడ్డి, పులగం సుబ్బు, విజయ్, సంతోష్ వీర మహిళలు మహాలక్ష్మి, లక్ష్మీ మరియు కూకట్పల్లి నియోజకవర్గ బిజెపి నాయకులు హరిబాబు తదితరులు పాల్గొన్నారు.