సాలూరు, ప్రమాదాలు సంభవించకుండా వీధి దీపాలను అమరుస్తున్న మున్సిపల్ సిబ్బంది. వివరాలు లోకి వెళ్తే సాలూరు ముఖ ద్వారం వద్ద నూతనంగా బైపాస్ నిర్మాణం జరిగింది. మున్సిపల్ ఇంచార్జ్ కమిషనర్ ప్రసాద్ ఆధ్వర్యంలో నూతన బైపాస్ జంక్షన్ వద్ద లైటింగ్ సూపర్వైజర్ సతీష్ వారి సిబ్బందితో వీధి దీపాలు వేశారు.అంతేకాకుండా ఈ బైపాస్ సుమారుగా 7 కిలోమీటర్లు జిగిరం వరకు నిర్మాణం ప్రభుత్వం చేసింది. ఈ ప్రాంతంలో నిర్మాణం జరిగినప్పుడు నుంచి ఇప్పటిదాకా చాలా ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అక్కడకక్కడే చనిపోయిన వ్యక్తులు కూడా ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ వీధి దీపాలు లేకపోవడం వచ్చే, పోయే వాహనాలకు వెలుతురు లేని కారణంగా ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయని పలువురు విమర్శిస్తున్నారు. దీనికి మున్సిపాలిటీ చర్యలు తీసుకొని నూతన బైపాస్ ముందు వీధి దీపాలను వేశారు. రానున్న మే నెలలో శ్యామలమ్మ పండుగ పెద్ద ఎత్తున జరుగుతున్నది పండగ ముందు వీధి దీపాలు ఏ ప్రాంతంలో లేవు ఆ ప్రాంతంలో వేయుటకు చర్యలు తీసుకుంటున్నారు. పురపాలక సంఘంకి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏ.ఈ డి.ఈ వారు కూడా సహకరిస్తే బాగుంటుందని పండగ పెద్దలు, ప్రజలు నాయకులు కోరుతున్నారు. ఇలానే ఉంటే ఇంకా ఎక్కువగా ప్రమాదాలు సంభవిస్తాయని పండుగ కూడా చాలా ఇబ్బందికర వాతావరణంలో జరుగుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Share this content:
Post Comment