పవన్ కళ్యాణ్ పై వైసీపీ అనుచిత వ్యాఖ్యలను ఖండించిన మూర్తి నాయక్

  • జనసేన పార్టీ గోపాల్ పేట మండల అధ్యక్షుడు మూర్తి నాయక్..

వనపర్తి: వైసీపీ నేతలు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యక్తిగత దాడిని జనసేన పార్టీ గోపాల్ పేట మండల అధ్యక్షుడు మూర్తి నాయక్ ఖండించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై, వారి కుటుంబంపై వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం మంచిదికాదు.. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై ట్విట్టర్, సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని వనపర్తి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు ముకుంద నాయుడు, మూర్తి నాయక్, సురేష్, ఉత్తేజ్, ప్రకాష్ అన్నారు. పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక వనపర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.