వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరిన ముస్లిం నేత

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం, 48వ డివిజన్ వైఎస్ఆర్సిపి కార్యదర్శి ఎస్.కె ముస్తఫా వైఎస్ఆర్సిపి పార్టీకి రాజీనామా చేసి జనసేన పార్టీ 48వ డివిజన్ అధ్యక్షులు కోరగంజి వెంకటరమణ నేతృత్వంలో ఎస్.కె ముస్తఫా, ఎస్.కె నాగూర్, ఎస్.కె షారు, దినేష్, కరీముల్లా మరియు వారి బృందంతో జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జ్ పోతిన వెంకట మహేష్ ఆధ్వర్యంలో పార్టీలోకి చేరడం జరిగింది. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నాయకత్వం పటిమ, పార్టీ సిద్ధాంతాలు, భావజాలం నచ్చి పార్టీలోకి చేరారని వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నామన్నారు. ముస్లిం మైనార్టీలకు జరుగుతున్న అనేక అన్యాయాలపై త్వరలోనే బలంగా ఉద్యమిస్తామని మహేష్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో షేక్ అమీర్ భాష, మొబీనా తదితరులు పాల్గొన్నారు.