రాష్ట్రంలోనే నెంబర్ వన్ అసమర్ధ ఎమ్మెల్యే ముస్తఫా

  • తొమ్మిదేళ్లుగా శాసనసభ్యుడిగా ఉండి నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదు
  • తూర్పు నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు కల్పించటంలో వైసీపీ పూర్తిగా విఫలమైంది
  • గుంతలమయంగా మారిన రోడ్లను పరిశీలించి ప్రజలకు మూవ్ ఆయింట్మెంట్ ప్యాకెట్లు పంపిణీ చేసిన జనసేన నాయకులు
  • వైసీపీ నుంచి ఆంద్రప్రదేశ్ విముక్తి అయినప్పుడే రాష్ట్రానికి మంచిరోజులు
  • తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి ఎలా చేయాలో జనసేన అధికారంలోకి రాగానే చూపిస్తాం
  • గుంటూరు నగర జనసేన పార్టీ అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్

గుంటూరు: ఒక్క పది నిముషాలు వర్షం పడితే చాలు రోడ్లన్ని నదుల్ని తలపిస్తున్నాయి, సరైన రోడ్లు లేవు, సైడ్ కాలువల నిర్మాణం లేదు అండర్ డ్రైనేజ్ వ్యవస్థే లేదు తొమ్మిదేళ్లుగా శాసనసభ్యుడిగా బాధ్యత వహిస్తున్న ముస్తఫా తూర్పు నియోజకవర్గాన్ని గాలికొదిలేశాడని గుంటూరు నగర జనసేన పార్టీ అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ మండిపడ్డారు. శుక్రవారం కొల్లి శారదా కూరగాయల మార్కెట్ ప్రాంతంలో గుంతలమయంగా మారిన రహదారులను పరిశీలించారు. రోజుకి కొన్ని వందల బస్సులు, ఆటోలు, ద్విచక్రవాహనలు తిరిగే రోడ్డు పాడైపోతే పట్టించుకోలేని స్థితిలో ఎమ్మెల్యే ముస్తఫా ఉన్నారని విమర్శించారు. తాను ఒక లక్ష రూపాయల పనిని కూడా నియోజకవర్గంలో చేయించలేకపోతున్నానని తనకు తానే అసమర్థుడినని చెప్పుకున్న ముస్తఫా రాష్ట్రంలోనే నెంబర్ వన్ అసమర్ధ శాసనసభ్యుడిగా వినతి కెక్కాడని ఎద్దేవా చేశారు. సంక్షేమం మాటున అభివృద్ధికి వైసీపీ పూర్తిగా తిలోదకాలు ఇవ్వటం శోచనీయం అన్నారు. లక్షల కోట్ల అప్పులు చేస్తూ కూడా ప్రజలకు మౌళిక సదుపాయాలు కల్పించలేని దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని ధ్వజమెత్తారు. వైసీపీ కబంధ హస్తాల్లోంచి రాష్ట్రం విముక్తి చెందినప్పుడే రాష్ట్రానికి మంచిరోజులు వస్తాయని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ అధికారంలోకి వస్తుందని అభివృద్ధి అంటే ఏమిటో అప్పుడు చేసి చూపిస్తామని నేరేళ్ళ సురేష్ అన్నారు. జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి మాట్లాడుతూ అధికార పార్టీ నేతల మధ్య ఏర్పడిన విభేదాలతో గుంటూరు నగర అభివృద్ధి మరింత కుంటుపడిందని విమర్శించారు. ప్రతీదానికి రేటు పెట్టి వసూలు చేసే కార్పొరేటర్ లు ప్రజల కష్టాల్ని, బాధల్ని మాత్రం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. వైసీపీ నియంత పాలనతో విసిగిపోయిన ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, జనసేనను మాత్రమే ప్రత్యామ్నాయంగా ప్రజలు చూస్తున్నారని ఆళ్ళ హరి అన్నారు. కార్యక్రమంలో జనసేన నేతలు కొండూరి కిషోర్ కుమార్, యడ్ల నాగ మల్లేశ్వరావు, జడ సురేష్, మాదాసు శేఖర్, బొడ్డుపల్లి రాధాకృష్ణ, ఆషా, నాగేంద్ర సింగ్, మెహబూబ్ బాషా, గడ్డం రోశయ్య, శాంతి కుమార్, పవన్ వెంకీ, పులిగడ్డ గోపి, పంతులు, సూదా నాగరాజు, ఉలవల వెంకటేశ్వర్లు, మాధవ తదితరులు పాల్గొన్నారు.