గునుకుల కిషోర్ ఆధ్వర్యంలో మై ఫస్ట్ ఓట్ ఫర్ జనసేన

నెల్లూరు, గత వారం రోజులుగా జరుగుతున్న మై ఫస్ట్ ఓట్ ఫర్ జనసేన అనే కార్యక్రమంలో భాగంగా హరినాదపురం కాలేజ్ స్టూడెంట్స్ తో ఓటు నమోదు కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ప్రెస్ మీట్ లో గునుకుల కిషోర్ మాట్లాడుతూ… స్వప్రయోజనాల కోసం వ్యక్తిగత లాభాల కోసం పార్టీ మారారు దానికి మాకేం అభ్యంతరం లేదు అది కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం పార్టీని వదిలి వస్తున్న వైసిపి పార్టీలో చేరారు ఆలోచించుకోవాలి. అంతటితో ఆగి ఉంటే బాగుండేది. మా నాయకుల మీద విమర్శలు చేయడం మాత్రం తగదు. నువ్వే చెప్పావు పవన్ కళ్యాణ్ ఆకాశం లాంటి వారు ఆకాశం మీద ఉమ్మివేయాలని చూస్తే అది మన మీదే పడుతుంది. క్రియాశీలక సభ్యత్వానికి కట్టిన 500 రూపాయల్ని ఫోన్పే లో 50 రూపాయల ఇన్సూరెన్స్ తో పోల్చినప్పుడే నీవే నీ మానసిక పరిస్థితి అర్థం అయింది. అందువల్లనే అనుకుంటా పోటీ చేసిన సిటీ నియోజకవర్గంలో 361 రోజులు తిరిగానని చెప్పుకుంటూ నువ్వు కనీసం వంద క్రియాశీల సభ్యత్వాలు కూడా చేయలేకపోయారు. అందరితో నువ్వే చెప్పావు నమ్మి సామాన్య కానిస్టేబుల్ కొడుకువైన నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని… ఇంతకీ మీ పార్టీ ఏ నియోజకవర్గంలో మీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తుంది. రాజకీయానికి చాలా ఓపిక అవసరం వేచి ఉండలేక ఆత్రపడి నువ్వు పార్టీ మారడం జరిగింది. హాస్యాస్పదం ఏంటంటే ప్రతి ఇంట్లో జగన్మోహన్ రెడ్డి బొమ్మ గోడకు వేలాడుతుందని చెప్పడం అక్కడక్కడ ఇల్లుకి దిష్టిబొమ్మలు కట్టు ఉంటారు వాటిని చూసి జగన్ మోహన్ రెడ్డి అనుకున్నారేమో. సవాల్ చేస్తున్నాను నెల్లూరు నగర్ నియోజకవర్గంలో ఎంత మంది ఇళ్లలో జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఉన్నాయో వేళ్ళ మీద లెక్కేసుకున్దాం రండి. నాయకుడి ఆశయాలు నమ్మి తోడు నడవలేక పోయారు .మీరు ప్రజలు నరకయాతన పడుతుంటే అంతా వైసిపి సైడ్ ఉన్నారు అనడం మీ అమాయకత్వానికి నిదర్శనం. నారాయణపై పెద్ద పోరాటం చేసానన్న మీరు వైసీపీ సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ని ఎన్నిసార్లు తిట్టారు, ఆయనతో కలిసి పని ఎలా చేస్తారు. కుల మతాలకతీతంగా పనిచేసుకుపోతున్న జనసేన పార్టీ పెద్దలని కులాల పేరుతో దూషించడం అవసరమా..? వైసీపీ పార్టీలో చేరగానే కుల మతాలని విడదీసి చూడటం ప్రారంభించారు. మీతో నడిచిన ప్రతి ఒక్కరూ ఒకే కులానికి సంబంధించిన వారు కాకపోవడం మీరు గమనించారా.. ఏ సమస్య చెప్పినా ప్రభుత్వం ఒక రోజులో చేసి పెడుతుందన్నారు మా నెల్లూరు రూరల్ వైయస్సార్ నగర్ మరియు శ్రామిక నగర్ లో రోడ్లు లేవని దాదాపుగా ఆరు నెలల నుంచి గగ్గోలు పెడుతున్నాము. కార్పొరేషన్ లో డబ్బులు లేవు చేయలేకున్నామని చెప్పి అని అధికారులే స్పష్టం చేస్తున్నారు దీని గురించి మీ అభిప్రాయం ఏమిటి. ఎమ్మెల్యే సీటు బిక్ష పెట్టిన దేవుడు లాంటి వ్యక్తిని శని ఆదివారాల్లో కనపడుతున్నారని ఎద్దేవా చేస్తారా. రోజులో మీరు ఎన్ని గంటలు రాజకీయం చేశారు నెల్లూరు నగర ప్రజలకు అందరికీ తెలుసు. సగం రాజకీయం ఎన్ని రాత్రి వేళలో ఎన్ని గంటలకి ఎక్కడ స్టార్ట్ చేస్తారో ప్రజలందరికీ గమనమే. జనసేన పార్టీ నాయకుల్ని జనసేన ను దూషించడం మానుకుంటే మంచిది ఎలాగో మీరు ఏ నియోజకవర్గంలో పోటీ చేయలేరు కాబట్టి వారి ఆఫీస్ వర్క్ ఏదైనా ఉంటే వెనక ఉండి మీరు నిర్వహించండి. అన్నం పెట్టిన అమ్మను ఎమ్మెల్యే పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన అన్నను మర్చిపోవడం కంటే పాపం లేదు. నోరు హద్దులో పెట్టుకుని మంచి మాట్లాడితే మంచిది జన సైనికులు జనసేన నాయకులు కాపు నాయకులు మీతో గతంలో ఉండొచ్చు కానీ ఇప్పుడు ఎవరు మీకు తోడుగా నడవరని గుర్తుంచుకోండి. నా సేన కోసం నా ముందు నా ఒకరోజు శాలరీ నా జనసైన కే అని మేమంతా ఇచ్చింది ఏదో ఆశించి కాదు జనసేన పార్టీలో మాకు కూడా భాగస్వామ్యం ఉంది అని తెలియజేయడానికి. మీకు చెప్పిన అర్థం కాదు ఎందుకంటే అక్కడక్కడ మీరు పార్టీ పేరు చెప్పితీసుకున్నదే గాని మీరు పార్టీకి ఎంత ఇచ్చింది అనేది లెక్క చూసుకోగలరు. మొదటి రోజు నుంచి సిటీకి కాబోయే ఎమ్మెల్యే వినోద్ రెడ్డి అనే ప్రచారం చేశారు.అధికార పార్టీ వదిలేస్తే ప్రతిపక్ష పార్టీలు ఎవరు కూడా మేమే ఎమ్మెల్యే అని ఇప్పటిదాకా చెప్పుకున్న దాఖలాలు లేవు. ఆరు నెలలు ముందుగానే మిమ్మల్ని పిలిపించి నారాయణకు చేయమని చెప్పానంటున్నారు ఇది ఎంతవరకు సబబు అప్పటికి ఇంకా పొత్తులే కన్ఫర్మ్ కాలేదు 175 నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ రిపోర్ట్ తెప్పించుకుంటున్నారు. ఇకనైనా సొంత ప్రయోజనాలు చూసుకొని మా నాయకులు జోలికి మా పార్టీ జోలికి రాకుండా ఉంటే మంచిది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, బన్నీ, వర, కేశవ, మౌనిష్ తదితరులు పాల్గొన్నారు.