ఆహ్వానం అందకపోయినప్పటికీ నా ప్రధాన కోరిక నెరవేరింది: పోలిశెట్టి

మైలవరం: ఇటీవల ఇబ్రహీంపట్నం తుమ్మలపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించబోతున్న స్మశాన వాటిక శంకుస్థాపన కార్యక్రమానికి ప్రభుత్వం అధికారులు జనసేన పార్టీ ఎంపీటీసీ సభ్యులు పోలిశెట్టి తేజని ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానించకపోవడంపై ఆయన స్పందించారు. నన్ను ఆహ్వానించకపోయినా నేను పోరాటం చేసిన హిందూ స్మశాన వాటిక నిర్మాణానికి నిధులు ప్రభుత్వం సమకూర్చుటం సంతోషంగా ఉందని నా ప్రధాన కోరిక నెరవేరిందని తెలియజేశారు.. అధికార పార్టీ ప్రతినిధులు మరియు మండల, గ్రామస్థాయి ప్రభుత్వాధికారులు నన్ను దూరం పెడుతున్నప్పటికీ నన్ను నమ్మిన ప్రజలు నన్ను తమ ఇంట్లో మనిషి లాగా చూసుకుంటారని భవిష్యత్తులో గ్రామానికి మరియు మండలానికి రావలసిన నిధులు, అభివృద్ధి పనులకోసం ప్రశ్నిస్తూ, పోరాటాలు చేస్తూ ఉంటానని ధీమా వ్యక్తం చేశారు.