కుప్పంలో ‘నా సేన కోసం నా వంతు’

కుప్పం నియోజకవర్గం, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయ‌ సాధనలో భాగంగా, చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ సూచనలతో, కుప్పం నియోజకవర్గ ఇన్చార్జ్ డా.మద్దినేని వెంకటరమణ పర్యవేక్షణలో గురువారం శాంతిపురం మండలం తుమ్మిశి పరిధిలో “నా సేన కోసం నా వంతు” కార్యక్రమాన్ని కుప్పం నియోజకవర్గం జనసేన నాయకులు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో, చిత్తూరు జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శులు వేణు, మండల అధ్యక్షులు కిషోర్, మండల కార్యవర్గ సభ్యులు సురేష్, రవితేజ, సంపత్ మరియు కిరణ్ తదితరులు పాల్గొనడం జరుగింది.