కె.వి.బి పురం మండలంలో నా సేన కోసం నా వంతు

సత్యవేడు నియోజకవర్గం కె.వి.బి పురం మండలంలో జనసేన పార్టీ అభివృద్ధి కొరకు నా సేన కోసం నా వంతు కార్యక్రమం మండల అధ్యక్షుడు థామస్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కార్యదర్శి కొప్పల లావణ్యకుమార్ హాజరయ్యారు. జనసేన పార్టీ కోసం 10 రూపాయలు నుండి ఎంత అయినా విరాళంగా ఇవ్వ వచ్చు అని, ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి విజయవంతం చేయాలని.. ప్రజలను జనసేన పార్టీ లో భాగస్వాముల్ని చేయడమే ఈ కార్యక్రమము ముఖ్య ఉద్దేశం అని తెలియజేసారు. ఈ కార్యక్రమము లో మండల ఉపాధ్యక్షుడు మోహన్, బాషా, చైతన్య, సందీప్, మహేష్, రుద్ర, కిషోర్, హరీష్, హేమాద్రి, చెంగయ్య, దేవేంద్ర, వంశీ తదితరులు పాల్గొన్నారు.