వెలుగుబందలో ‘నా సేన కోసం నా వంతు’

  • బత్తుల ఆధ్వర్యంలో జనసేనలో చేరికలు

రాజానగరం, వర్షాన్ని సైతం లెక్కచేయకుండా సాయంత్రం వేళ ఇంతమంది ఎక్కడికి విచ్చేసిన జనసేన నాయకులకు కార్యకర్తలకు వెలుగుబంద ప్రజానీకానికి పవన్ కళ్యాణ్ అభిమానులకు అందరికీ నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను అని ప్రసంగాన్ని ప్రారంభించారు. వాతావరణం అనుకూలించనప్పటికీ మీరంతా ఇంత భారీ ఎత్తున దేనినీ లెక్కచేయకుండా ఘనంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది అని అన్నారు. వాతావరణం అనుకూలించని కారణంగా ఇవాళ చేయవలసిన పరామర్శలు, గ్రామ పెద్దల్ని కలిసే కార్యక్రమాలు ఇంకొక రోజు ఏర్పాటు చేయవలసిందిగా వెలుగుబంద జనసైనికులను కోరడం జరిగింది. ప్రజా శ్రేయస్సు కోరుకునే పార్టీలో ప్రజలను ఇబ్బంది పెట్టడం సబబు కాదు అని ఈ కార్యక్రమాన్ని వీలైనంత తొందరగా ముగించి మరొక రోజు భారీ స్థాయిలో మనందరం కలిసి ఏర్పాటు చేసుకుందాం అని తెలియజేశారు. వచ్చే ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని స్థాపించడానికి మన వంతు కృషి చేద్దాం అని పిలుపునిచ్చారు. అధికార పార్టీ బెదిరింపులను ఎవరూ లెక్క చేయొద్దు, దుష్ట పరిపాలన తొందరలోనే అంతమవుతుంది మనకు మంచి పరిపాలన రాబోతుంది మనందరం కలిసికట్టుగా మనకు ఉన్న వనరులను ఉపయోగించుకుని మంచి సమాజాన్ని నిర్మించుకుందాం అని ఈ సందర్భంగా తెలియజేశారు. మన జనసేన పార్టీ ప్రజల పార్టీ దాని ఆర్థిక పరిపుష్టిని పెంచడం మన బాధ్యత అని నా సేన కోసం నా వంతు కార్యక్రమం యొక్క ఆవశ్యకతను వివరించారు. ప్రతి ఒక్క జనసైనికుడు తమ తమ వీలును బట్టి నా సేన కోసం నా కార్యక్రమానికి సహకారాన్ని అందిస్తారని తెలియజేసారు. మరొక సందర్భంలో మనమందరం సమిష్టిగా కూర్చుని మాట్లాడుకుందాం వాతావరణం అనుకూలించకపోవడం వలన ఇప్పటికి సెలవు తీసుకుందాం ఖచ్చితంగా భారీ ఎత్తున మరలా మనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుందాం. రాబోయే రోజుల్లో వెలులుబంద గడ్డ జనసేన అడ్డాగా మారుద్దామని బత్తుల పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వెలుగుబంద జనసైనికులకు జనసేన నాయకులకు మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అని ప్రసంగాన్ని ముగించారు. నా సేన కోసం నా వంతు కమిటీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి మాట్లాడుతూ.. సమకాలీన రాజకీయ వ్యవస్థలో ఒక నూతన ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న పవన్ కల్యాణ్ కి ‌సంఘీభావంగా జన‌సేన పార్టీకి మీ వంతు సహకారంగా నా సేన కోసం నా వంతు కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. వెలుగుబంద జనసైనికులను అభినందిస్తూ.. గ్రామంలో ఎటువంటి సమస్యలు వచ్చినా మేము అండగా నిలబడతాం సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం. ఒకవేళ మా పరిధిలో ఆ సమస్యకి పరిష్కారం దొరకకపోతే ఆ సమస్యని జనసేన అధినేత పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం అని హామీ ఇచ్చి ప్రసంగాన్ని ముగించారు. అనంతరం విధి విధానాలు నచ్చి వెలుగుబంద గ్రామ వైసీపీ మహిళా కార్యకర్తలు బత్తుల వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది. బత్తుల దంపతులు ఇలానే ప్రజాపక్షాన నిలబడి సమాజ అభివృద్ధికి మరింత కృషి చేయాలని ఇలాంటి నాయకులు రావడం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తోట అనిల్ వాస్, నల్లమొల్లా సోమన్న, మొక్కపాటి గోపాలం, ముత్యం నరసింహారావు, చాట్ల వెంకటేష్, ప్రెగడ సోమరాజు, రాజా, వీరబాబు, శివ మరియు జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.