బత్తుల ఆధ్వర్యంలో నా సేన కోసం నా వంతు

  • అధికార పార్టీ బెదిరింపులకు లొంగొద్దు, భయపడొద్దు
  • మీకోసం నేను ఎలాంటి పోరాటానికైనా సిద్ధం
  • నేను, నా శ్రీమతి 24 గంటలు మీకు అందుబాటులోనే ఉంటాము
  • నాతో సహా అందరూ జనసైనికులే, అందరం పార్టీ కోసం పనిచేద్దాం
  • రాజనగరంలో జనసేన జెండాని బలంగా ఎగరేద్దాం

రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం కొండ గుంటూరు గ్రామంలో ఏర్పాటు చేసిన నా సేన కోసం నావంతు కార్యక్రమానికి విచ్చేసిన రాజానగరం నియోజకవర్గ నాయకులు బత్తుల బలరామకృష్ణ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నాసేన నావంతు కమిటీ కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి లకు కొండ గుంటూరు ప్రజానికం పుష్పాభిషేకాలతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ అతి తక్కువ సమయంలో ఏర్పాటు చేసిన అరిగెల రామకృష్ణకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వేదిక అలంకరించిన స్త్రీ మూర్తులకు నమస్కరిస్తూ జనసేనకి బలంగా నిలబడే కొండ గుంటూరు జనసైనికులను చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు. జనవాణి కార్యక్రమం ద్వారా ప్రజలకు సమస్య పరిష్కారం చూపే పవన్ కళ్యాణ్ కి ఉత్తరాంధ్రలో కావాలని బురదజల్లి వారు చేస్తున్న అక్రమాలు ఋషికొండ దోపిడీలు బయటపడతాయని భయంతో పవన్ కళ్యాణ్ ని తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. ప్రభుత్వ ఆస్తులతో కలిపి ఉత్తరాంధ్రలో ఉన్న చాలా భూములు భవనాలు తాకట్టు పెట్టుకున్నారు. ఎన్ని రకాలుగా పవన్ కళ్యాణ్ ని ఇబ్బంది పెట్టినా 500 మంది పోలీసులతో గృహనిర్బంధం చేసిన ఆయన జనవాణిని విజయవంతంగా పూర్తి చేశారు. ఎయిర్ పోర్ట్ లో కూడా కావాలని జనసైనికులను మంత్రి రోజా రెచ్చగొట్టినా సమన్వయం పాటించి ఓపికతో ఉన్నారు. ఎవరూ కూడా అధికార పార్టీ బెదిరింపులకు లొంగొద్దు, భయపడొద్దు సంక్షేమ పథకాలే గాని ఇంక ఏ విషయంలో గాని మిమ్మల్ని ఇబ్బంది పెడితే మీ లోకల్ నాయకుడి ద్వారా నా దృష్టికి తీసుకొస్తే మేము టెంట్లు వేసుకుని కూర్చుని పోరాడతాం. మీకోసం నేను పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను నేను, నా శ్రీమతి 24 గంటలు మీకు అందుబాటులోనే ఉంటాము. ఇటువంటి ఇబ్బంది వచ్చినా మాకు ఫోన్ చేయండి. మీరు అనుకోవచ్చు సమయం సందర్భం ఉండలిగా అని, అవసరం లేదు మీ తాటాకు చప్పుళ్ళకు భయపడడానికి ఇక్కడ మామూలు బలరామకృష్ణ కాదు రాటు తేలిన బలరామకృష్ణ. దెబ్బకి దెబ్బ మాటకి మాట సమాధానమే నా నినాదం. గత ప్రభుత్వం ఏర్పాటుకు మీరు చేసిన పనులు తిప్పికొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వాళ్లు అధికారంలోకి వచ్చి కొండల్ని, గుట్టల్ని కొట్టుకుపోతున్నారు. అన్నీ ప్రజలు గమనిస్తున్నారు, వీటన్నింటినీ ఘంటాపథంగా ఎదిరిద్దాం. మీ అందరిలో రాముడిని చూస్తూ మీకు సేవ చేసే పవనుడు ఆంజనేయుడు పవన్ కళ్యాణ్, జరిగిన కాలాన్ని మర్చిపోండి మంచి భవిష్యత్తు మన కళ్ళ ముందు ఉంది దానికోసం ఆలోచించండి నాతో సహా అందరూ ఇక్కడ జనసైనికులే, అందరం పార్టీ కోసం పనిచేద్దాం. రాజనగరంలో మొట్టమొదటిసారిగా జనసేన జెండాని బలంగా ఎగరేద్దాం అని బత్తుల జనసైనికులకు తెలియజేశారు. అనంతరం నాసేన కోసం నా వంతు కార్యక్రమం ఆవశ్యకతను వివరిస్తూ ఇప్పటివరకు రాజనగరం నియోజకవర్గం నుంచి బత్తుల బలరామకృష్ణ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నా సేన కోసం నా వంతు కమిటీ కోఆర్డినేటర్ భక్తుల వెంకటలక్ష్మి సుమారు 14 లక్షల 50 వేలు సేకరించి పార్టీకి విరాళంగా కొణిదల నాగబాబుకి అందించామన్న విషయాన్ని తెలిపారు. ఇంకా ఎక్కువగా మనం పార్టీ కోసం పాటుపడాలని తెలిపారు. రామ జన్మభూమికి విరాళాలు ఇవ్వడం ఎంత పుణ్యమో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి విరాళం ఇవ్వడం కూడా అంతే పుణ్యం. జనసేన పార్టీ అధికారంలోకి రావడానికి మీ వంతు సహకారం అందిస్తారని విజ్ఞప్తి చేస్తున్నాను. రాముడి కోసం, హనుమంతుడి కోసం చెబుతున్నా అని హిందుత్వం అనే అపోహ పడకండి అది మన చరిత్ర కాబట్టి వివరిస్తున్నాను. నేను ఒక చర్చి కట్టించాను, ఎన్నో ఇతర మత కార్యక్రమాలకు విరాళాలు ఇచ్చాను. దానిని పరిగణలోకి తీసుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఆత్మవిమర్శ చేసుకుని ఎవరు నెగ్గితే మనకి మంచి జరుగుతుందో అనేది ఆలోచించి మీరు ముందుకు సాగాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నానని బత్తుల బలరామకృష్ణ ఆయన ప్రసంగాన్ని ముగించారు. అనంతరం బత్తుల వెంకటలక్ష్మి మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి గ్రామం పవన్ కళ్యాణ్ కి ధన బలము మనమే, జన బలము మనమే అని బత్తుల వెంకటలక్ష్మి ఘంటాపథంగా తెలియజేస్తూ..వైజాగ్ లో పవన్ కళ్యాణ్ అనే ఒక్క మనిషి కోసం 5,000 మంది పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారంటే వారికి ఎంత భయమో అర్థం చేసుకోవచ్చు అని తెలియజేసారు. అనంతరం రోజా చేసిన హై డ్రామాని ఎద్దేవా చేశారు. నా సేన కోసం నా వంతు కార్యక్రమ ఆవశ్యకతను ప్రజలకు వివరించారు.

  • బత్తుల బలరామకృష్ణ సమక్షంలో జనసేనలో భారీ చేరికలు

రాజానగరం నియోజకవర్గ రాజాకీయాల్లో పెనుమార్పు తీసుకొచ్చి జనసేన పార్టీని అంచెలంచెలుగా విస్తరింపజేస్తూ. ప్రజాక్షేత్రంలో ప్రజలకోసం బలంగా పోరాడుతున్న బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మిలను ఎందరో ఆదర్శంగా‌ తీసుకుని జనసేన వైపు అడుగులు వేస్తున్నారు. జనసేన పార్టీ విధివిధానాలు, బత్తుల దంపతులు ప్రజలకు చేసే సేవకు ఆకర్షితులై ఆదివారం రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం, కొండ గుంటూరు గ్రామంలో వైసీపీ, టీడీపీ పార్టీల నుంచి సుమారు 90 మంది జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో అరిగెల రామకృష్ణ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. బలరామకృష్ణ నూతన నాయకులకు, కార్యకర్తలకు జనసేన కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంతో రాజానగరం మండలంలోని మారుతున్న రాజకీయ సమీకరణాలకు మరింత బలం చేకూరింది. అడుగడుగునా జనసేనకు ప్రజలు బ్రహ్మరథం పడుతూ బత్తుల బలరామకృష్ణ నాయకత్వంలో రాజానగరం నియోజకవర్గ అభివృద్ధి ఎన్నడూ లేని విధంగా ఉండబోతోందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన శ్రేణులు కిమిడి శ్రీరాం, అరిగెల రామకృష్ణ, బోయిడి వెంకట్, ఈవూరి గోవింద్, అరవ సూర్యనారాయణ, నల్లా దుర్గా ప్రసాద్, అగర్తి రజినికాంత్ , పెనుమాక చిరంజీవి, పెమ్మనపోయిన వీర్రాజు, పెమ్మనపోయిన సూరన్న కాపు, పెమ్మనపోయిన సుబ్బారావు, సైనబారపు శ్రీను, కోలా సత్తిబాబు, బెల్లాని పైడి కుమార్, ఇజ్జాడ వేణు గోపాల్ మరియు కొండ గుంటూరు జనసైనికులు, సంపత్ నగర్ జనసైనికులు, తోకాడ జనసేన శ్రేణులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.