బత్తుల ఆధ్వర్యంలో “నా సేన కోసం నా వంతు”

  • బత్తుల సమక్షంలో జనసేనలో చేరికలు

రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం సంపత్ నగర్ గ్రామంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన నా సేన కోసం నా వంతు కార్యక్రమానికి విచ్చేసిన రాజానగరం నియోజకవర్గ నాయకులు బత్తుల బలరామకృష్ణ మరియు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నాసేన నావంతు కమిటీ కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మికి సంపత్ నగర్ ప్రజలు ఘనస్వాగతం పలికారు. రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ సభను అలంకరించిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ జనసైనికులకు అభివాదం చేస్తూ ప్రసంగాన్ని ప్రారంభించారు. అంబులెన్సుల ప్రారంభోత్సవ కార్యక్రమం ముగించుకుని ఆదివారం సాయంత్రం మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్ నుంచి బయలుదేరి విశ్రాంతి తీసుకోకుండా రెండు గంటల్లో సంపత్ నగర్ కి చేరుకున్నాం. ఆలస్యమైనందుకు జనసైనికులు మన్నించాలని అన్నారు. అనంతరం బత్తుల మాట్లాడుతూ దోచుకోవడం కోసం దాచుకోవడం కాకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం వచ్చిన నాయకుడు ఎవడైనా ఉన్నాడంటే అది కేవలం పవన్ కల్యాణ్ గారు మాత్రమే అని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బంగారు భవిష్యత్తు కేవలం జనసేనతోనే సాధ్యమని వివరించారు. గాలి, నీరు, వాతావరణాన్ని కలుషితం చేస్తున్న ప్రభుత్వాన్ని నిలదీసే సత్తా జనసేనకు మాత్రమే ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రభుత్వ ఇస్తానన్న ఉచిత గృహాల నిర్మాణం ఆదిలోనే అంతమైపోయిందని ప్రభుత్వ తీరును ప్రశ్నించారు. రైతుల సబ్సిడీలు తొలగించి పంటపొలాల్లోని మోటార్లకు ఛార్జీలు విధించి రైతులని అవమానిస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. దేశ ధాన్యాగారం ఉండే ఆంధ్రప్రదేశ్లో రైతన్నకు అండ లేకుండా పోవడం అధికార పార్టీ సిగ్గు పడాల్సిన విషయం అని బత్తుల ధ్వజమెత్తారు. నష్టపోతున్న రైతులకి అండగా జనసేన నిలబడుతుంది. ఆరోగ్యశ్రీ పథకాన్ని అర్ధారోగ్య పధకంగా మారుస్తున్న తీరుని తప్పుపట్టారు. పేదలకు ఎలా మెరుగైన వైద్యం అందుతుంది అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాపునే‌స్తం ఊసేలేదు, ఉచిత పధకాల మాటేలేదు. చెప్పినవి నవరత్నాలు పెట్టినది పంగనామాలు అని ఎద్దేవా చేశారు. తండ్రిని చూసి తనయుడికి ఓటు వేస్తే తనయుడు యముడై రాష్ట్రాన్ని రావణకాష్టం చేస్తున్నాడని బత్తుల పేర్కొన్నారు. అర్హత ఉన్నా చెయ్యడానికి ఉద్యోగాలు లేవని ఉపాధి అవకాశాలు లేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఉద్యోగాల ఊసు ఎత్తితే వాలంటీర్లు, సచివాలయాల ఉద్యోగాలు తప్ప ఇంక ఎటువంటి మాటలేదని నిరుద్యోగుల కోసం జనసేన పోరాడుతుందని తెలియజేశారు రాజధాని లేని రాష్ట్రంలో రాజన్న రాజ్యం ఎలా తెస్తారు జగన్ రెడ్డి అని ప్రశ్నించారు. రాష్ట్రానికి పరిశ్రమలు రావాలన్నా, ఉపాధి అవకాశాలు పెరగాలన్నా, రైతులు ఆనందంగా ఉండాలన్నా జనసేన ప్రభుత్వం ఏర్పాటు అవ్వాలని ఆ మార్పు ఇక్కడినుంచే మొదలవ్వాలని విజ్ఞప్తి చేశారు. జనసేనలో ఒకే కులం, ఒకే మతం, ఒకే వర్గం ఉంటాయని, నియోజకవర్గంలో ఉన్న అసమానతలను తొందర్లోనే తొలగిపోతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రాణం పోయే వరకూ జనసైనికులకు, వీరమహిళలకు అండగానే ఉంటానని మరొక్కసారి గుర్తు చేశారు. నా సేన నావంతు అనే కార్యక్రమానికి మీరు అందించే సహకారం అయోధ్య రామ మందిరానికి మనమిచ్చిన విరాళమంత గొప్పదని వెల్లడించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నాసేన నావంతు కమిటీ కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి ప్రసంగిస్తూ పవన్ కళ్యాణ్ తలపెట్టిన నా సేన కోసం నావంతు కార్యక్రమం ఇంత బ్రహ్మాండగా జరగడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. జనసైనికులు ఎప్పుడూ ఒకరికి ఇచ్చే స్ధాయిలో ఉంటారే కాని ఒకరి దగ్గర ఆశించే స్ధాయిలో ఉండరని స్పష్టం చేశారు. బడుగు బలహీన వర్గాల కోసం పాటు పడే పార్టీ కోసం పనిచేయడం మా అదృష్టంగా భావిస్తున్నానని ఆమె పేర్కొన్నారు.

  • బత్తుల బలరామకృష్ణ గారి సమక్షాన జనసేనలో భారీ చేరికలు

రాజానగరం నియోజకవర్గ రాజాకీయాల్లో పెను మార్పు తీసుకొచ్చి జనసేన పార్టీని అంచెలంచెలుగా విస్తరింపజేస్తూ.. ప్రజాక్షేత్రంలో ప్రజలకోసం బలంగా పోరాడుతున్న బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి లను ఎందరో ఆదర్శంగా‌ తీసుకుని జనసేన వైపు అడుగులు వేస్తున్నారు. జనసేన పార్టీ విధివిధానాలు, బత్తుల దంపతులు ప్రజలకు చేసే మేలుకు ఆకర్షితులై ఆదివారం రాజానగరం నియోజకవర్గం రాజానగరం మండలం, సంపత్ నగర్ గ్రామంలో వైసీపీ, టీడీపీ పార్టీల నుంచి సుమారు “70” మంది జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో నూతన నాయకులకు, కార్యకర్తలకు జనసేన కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంతో రాజానగరం మండలంలోని మారుతున్న రాజకీయ సమీకరణాలకు మరింత బలం చేకూరింది. అడుగడుగునా జనసేనకు ప్రజలు బ్రహ్మరథం పడుతూ..బత్తుల బలరామకృష్ణ నాయకత్వంలో రాజానగరం నియోజకవర్గ అభివృద్ధి ఎన్నడూ లేని విధంగా ఉండబోతోందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన శ్రేణులు సంపత్ నగర్ ఉప సర్పంచ్ నల్లా దుర్గాప్రసాద్,‌ సేనపతుల మహేష్, తోరాటి చంచారావు, తిరుమలనాధుని కొండలరావు, కోనె మాణిక్యరావు, సేనపతుల మహేష్, పెంటగ్లి రాంబాబు, చెల్లూరి రాంబాబు, అయోధ్యుల శ్రీను, పినికి శ్రీను (డాన్), పెంటగంట్ల సూరిబాబు, రాయుడు శ్రీధర్, నల్లమల దొరబాబు, పేపకాయల శివ, ఆకుల అయ్యప్ప, చెల్లూరి సత్తిబాబు, యాళ్ళ సత్యనారాయణ, మదిరెడ్డి వెంకన్న, అరిగెల రామకృష్ణ, బోయిడి వెంకట్, నాతిపాము దొర, అడ్డాల దొర తదితరులతో పాటు సంపత్ నగర్ గ్రామ జనసైనికులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.