పితాని ఆధ్వర్యంలో ‘నా సేన కోసం నా వంతు’

అంబేద్కర్ జిల్లా కోనసీమ, ముమ్మిడివరం నియోజకవర్గం, ‘నా సేన కోసం నా వంతు’ కార్యక్రమంలో భాగస్వాములవుదాం జనసేనకు స్వచ్చంద విరాళాలు అందిద్దాం. జనసేన పిఏసీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నిల్యోయోజకవర్గంలో ముమ్మిడివరం, ఐ పోలవరం మండలాల్లో పర్యటించి గడప గడపకు తిరుగుతూ జనసేన పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని అభ్యర్థిస్తూ గ్రామంలోని పెద్దలకు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ సిద్దాంతాలను తెలియజేసి పార్టీలోకి రావాలని అభ్యర్థించిన జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చార్జ్ అలాగే స్వచ్ఛందంగా విరాళం అందించి ‘నా సేన కోసం నా వంతు’ ప్రచార కార్యక్రమం ప్రారంభించారు. స్వచ్చంద విరాళాలు అందించే వారికి అవగాహన కల్పించి వారితో జనసైనికులకు పితాని బాలకృష్ణ పిలుపునిచ్చారు. కుల, మతాలకు అతీతంగా ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజల పక్షాన నిలబడి పని చేస్తోన్న జనసేనకు అండగా నిలిచేందుకు ‘నా సేన కోసం నా వంతు’ కార్యక్రమంలో భాగస్వాములై జనసేనకు స్వశక్తినే నమ్ముకుని జనసేన పార్టీ స్థాపించిన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ భవిష్యత్తు తరాల ప్రయోజనం కోసం పనిచేస్తున్న జనసేనకు స్వచ్ఛందగా విరాళాలు ఇచ్చి ప్రోత్సాహిద్దామన్నారు. నా సేన కోసం నా వంతు, జనసేన పార్టీ బ్యాంక్ ఖాతాకు అనుసంధానం అయిన 7288040505 నెంబర్ కు స్వచ్చంద విరాళం అందించాలని పితాని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.