“నా సేన నాకోసం నా వంతు” కార్యక్రమం విజయవంతం చేయాలి: ప్రత్తిపాడు జనసేన

ప్రత్తిపాడు, ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామంలో “నా సేన నాకోసం నా వంతు” కార్యక్రమం విజయవంతం చేయాలని మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్చార్జి వరుపుల తమ్మయ్యబాబు మాట్లాడుతూ… ప్రత్తిపాడు నియోజవర్గ జనసేన పార్టీ శ్రేణులు అందరకి జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాధనంతో ముందుకెళ్తున్న జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేపట్టిన “నా సేన నాకోసం నా వంతు” కార్యక్రమం ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క అభిమానాన్ని చూస్తున్నటువంటి ఏకైక వ్యక్తి రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ఒక్కరే. రాజకీయ చదరంగంలో ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానివ్వండి ప్రతిపక్ష నాయకుడు కానివ్వండి ప్రజలకు అభివృద్ధి చేసే కార్యక్రమంలో కూడా కానివ్వండి వాళ్ళందరూ కూడా ఫెయిల్ అవ్వడం జరిగింది. జనసేన పార్టీ ఈరోజున ఈ రాష్ట్రంలో దూసుకుపోతుంది అదేవిధంగా రకరకాల పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బులతోటి అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి సంఘటన ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో కౌలు రైతులు చనిపోతే దాదాపు 3,000 మందికి 30 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి ఏకైక నాయకుడు ఒక పవన్ కళ్యాణ్ మాత్రమే. అలాగే రకరకాలు కార్యక్రమాలు ఎవరికి ఏ ఆపద వచ్చినా సరే స్పందించి మంచి కార్యక్రమాలు చేసి సహాయం చేశారు. సినీ పరిశ్రమ నుంచి వచ్చినటువంటి ఆదాయాన్ని ఈ విధంగా ఉపయోగించడం చూసి పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ ఆలోచించి పుట్టినరోజు చేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ప్రజా సంక్షేమం కోసం ప్రజల యొక్క సమస్యలు తీర్చే విధంగా చేయూత రోడ్స్ అని చెప్పేసి ఈ విధంగా రోడ్లన్నీ కూడా బాగు చేయాలని అదే నా పుట్టినరోజు నాడు మీరు చేసే మంచి కార్యక్రమం అని చెప్పి పవన్ కళ్యాణ్ అన్నారు ఈ పార్టీ పెద్దలు సూచించిన మేరకు పార్టీ బలోపేతం అవ్వాలి ఆర్థిక పరిస్థితి బాగుండాలి ఎన్నో కార్యక్రమాలు చేయాలంటే రేపు రానున్న ఎన్నికల ముందుకి వెళ్ళాలంటే పార్టీ వద్ద డబ్బు ఉండాలి. ఈ పార్టీ మెయింటినెన్స్ గురించి ఆలోచించి “నా సేన కోసం నా వంతు” అని చెప్పేసి ఈ కార్యక్రమం జరిపించడం జరిగిందని అన్నారు. నల్లల రామకృష్ణ జనసేన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ… ప్రత్తిపాడు ఇన్చార్జి వరుపుల తమ్మయ్య బాబు ద్వారా కళ్యాణ్ అంటే జనసేన పార్టీలో ఉండేటువంటి “నా సేన కోసం నా వంతు” అనే కార్యక్రమం మొదలుపెట్టాం అని నెంబర్ 7288040505 పేటీఎం ద్వారా గాని ఫోన్ పే ద్వారా గాని గూగుల్ పే ద్వారా గాని ఇతర ఎలక్ట్రానిక్ సౌకర్యాల ద్వారా గాని ఇది ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి వెళ్లి ప్రతి జనసేన నాయకుడు ప్రతి జనసేన కార్యకర్త శ్రేణులు అందరూ కూడా ప్రతి ఇంటింటికి వెళ్లి ఈ సౌకర్యాల గురించి చెప్పి జనసేన సిద్ధాంతాల గురించి గానీ మేనిఫెస్టో గురించి గానీ క్లియర్ గా వివరించి వారిని మోటివేట్ చేసి ఇందులో భాగ్యస్వామ్యం చేసేటటువంటి బాధ్యత జనసేనలో ఉండేటటువంటి ప్రతి ఒక్కరి పైన అనేటటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. రోజు ఉండేటటువంటి పార్టీలన్నీ కూడా ధనవంతుల యొక్క బ్లాక్ మెయిల్ తోనో ఇవాళ వాళ్ళ యొక్క కబంధహస్తాల్లో ఉండి మనీ అంతా పెట్టుబడిగా ప్రజల భాగ్యస్వామ్యంగా గాని లేదా ఈ రాజకీయ పార్టీల పైన ప్రజల యొక్క సాధికారత గాని కనబడనివ్వకుండా మాకు ఓట్లు వేశారు మేము పరిపాలిస్తున్నామని మిగతా పార్టీలు చెప్పడానికి ట్రై చేశాయి. కానీ పవన్ కళ్యాణ్ ట్రాన్స్పెరెన్సీ(పారదర్శకత) గురించి ఎకౌంటుబుల్టీ(జవాబుదరీతనం) ఈ రెండు కూడా ప్రజాస్వామ్యంలో పెంచుతాం. దాసం సేసారవు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల సమ్యుక్త కార్యదర్శి మాట్లాడుతూ… పార్టీకి అండగా జనసేన పార్టీ కోసం బాధ్యతగా జనసేన కోసం నా వంతు రాజ్యాధికారంలో మార్పు కోసం వివక్షతలేని సమాజం కోసం నవ సమాజ నిర్మాణం కోసం బంగారు భవిష్యత్తు కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీకి అండగా ఆర్థిక చేయూత చేయాలని నా సేవ కోసం నా వంతు మనందరం కూడా బాగా స్వాములు అవ్వి ఈ పార్టీకి ఆర్థిక చేయూతను ఇచ్చినటువంటి సమయం మనందరికీ కూడా ఆసన్నమైంది. మనందరం కూడా ఈ విరాళం ఇచ్చే కార్యక్రమం మనమందరం చేయాలి అలాగే ఈ పార్టీకి మనందరం కూడా అండగా ఉంటూ మనం ఎంత ఇచ్చామన్నది కాకుండా పార్టీ నిర్మాణంలో మనం ఎంతవరకు బాగా స్వాములు అయ్యాం అన్నది ముఖ్యం అందుకే మన పార్టీకి అండగా ఉంటూ ఆర్థిక చేయూతను చేద్దాం. ఈ కార్యక్రమానికి హాజరైన పెంటకోట మోహన్ ఏలేశ్వరం మండలం జనసేన పార్టీ అధ్యక్షుడు శరణం జయబాబు శంఖవరం మండలం జనసేన ఉపాధ్యక్షుడు నాని, దుర్గాప్రసాద్, ప్రభు తదితరులు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.