జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు శ్రీ వీరబాబుకి 5 లక్షల చెక్కు అందజేసిన నాదెండ్ల మనోహర్

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం ఏరుపల్లికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు శ్రీ అబ్బిరెడ్డి వీరబాబు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. జిల్లా పర్యటనలో భాగంగా పార్టీ పీఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ రామచంద్రపురం మండలం, ఏరుపల్లిలోని శ్రీ వీరబాబు ఇంటికి వెళ్లి అతని కుటుంబాన్ని పరామర్శించారు. అతని తల్లిదండ్రులు శ్రీ అబ్బిరెడ్డి వెంకటేశ్వరరావు, శ్రీమతి శ్రీలక్ష్మిలను ఓదార్చారు. శ్రీ వీరబాబు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. శ్రీ వీరబాబు అకాల మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. పార్టీ క్రియాశీలక సభ్యులకు వర్తించే ప్రమాద బీమా పథకం కింద రూ. 5 లక్షల చెక్కును శ్రీ వీరబాబు తండ్రి శ్రీ వెంకటేశ్వరరావుకు అందచేశారు. ఆ కుటుంబానికి పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.