నాదెండ్ల మనోహర్ ను వెంటనే విడుదల చేయాలి: సిజి రాజశేఖర్

పత్తికొండ: అక్రమ అరెస్ట్ చేసిన జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ను గారిని మరియు జనసేన పార్టీ నాయకులను వెంటనే విడుదల చేయాలని జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయ బాధ్యుడు సిజి రాజశేఖర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సిజి రాజశేఖర్ మాట్లాడుతూ జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారికి ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా అలాగే పోలీస్ స్టేషన్ తరలించడం ప్రజాస్వామ్యంలో సరైన పద్ధతి కాదు, అందరికి ఉపయోగపడే విశాఖలోని టైకూన్ కొడాలి నుంచి వీఐపీ వెళ్లే మార్గాన్ని మోసివేయడం దుర్మార్గమైనటువంటి చర్య మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలి, కానీ ప్రశ్నించే వారిని గొంతు నొక్కడం, జగన్మోహన్ రెడ్డి గారికి ఈ వైసీపీ ప్రభుత్వానికి అలవాటైపోయింది, ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా అరెస్టు చేయడం, ప్రజాస్వాములో సరైన పద్ధతి కాదు, ప్రశ్నించే వారిని నానాక చిత్రహింసలకు గురిచేసి అక్రమ కేసులు బనాయించి జైల్లో కూర్చోబెట్టడం ఇలాంటి పెరికిపంద చర్యలు పాటించడం ఆంధ్ర ప్రదేశ్ ప్రస్తుత ప్రభుత్వానికి అలవాటుగా మారిందని, ప్రశ్నించే సమయం కూడా ఇవ్వకుండా, ప్రజలందరికీ ఉపయోగ పడే పనులు చేస్తూ ఉంటే ప్రతిపక్షాలు ఎందుకు విమర్శిస్తాయని ఆలోచన చేయాలని, ప్రస్తుత ప్రభుత్వానికి తెలియజేశారు, ఇకనైనా మీ పెరికిపంద చర్యలు మానుకోకపోతే ప్రజలే రేపు రాబోవు ఎన్నికలలో మీకు బుద్ధి చెప్తారు అన్నారు. ప్రశ్నించిన వారిని అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయడం కాకుండా ప్రశ్నించే అంత తప్పు మా ప్రభుత్వం ఏం చేసిందని ఆత్మసాక్షిగా పరిశీలన చేసుకొని ప్రజలందరినీ ఉచిత పథకాల ద్వారా మభ్య పెట్టడం కాకుండా నీతిగా నిజాయితీగా ప్రవర్తించాలని ప్రజలకు ఉపయోగపడే నాయకులని హర్షించే విధంగా ప్రభుత్వం నడుచుకోవాలని అంతేకానీ ఇలా ప్రశ్నించే ప్రతి ఒక్కరిని అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయడం, మీ ప్రభుత్వం చేతకానితనమే అని ఎద్దేవా చేశారు ఏది ఏమైనా అక్రమంగా అరెస్టు చేసిన జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారిని మరియు జనసేన పార్టీ ముఖ్య నాయకులను అలాగే వీరమహిళను వెంటనే విడుదల చేయాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ నాయకులు, ఇస్మాయిల్, నూర్ భాషా, ధనుంజయ, రాజశేఖర్, మొదలగువారు పాల్గొన్నారు.